గడ్డం గంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
మూడు సార్లు లోకసభకు ఎన్నికైన గంగారెడ్డి తొలిసారి 1991లో [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్ధిగా [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం|నిజామాబాదు నియోకవర్గం]] నుండి 10వ లోక్‌సభకు ఎన్నికై 1996 దాకా పనిచేశాడు. ఆ తర్వాత రెండేళ్ళ విరామం తర్వాత 1998లో తిరిగి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలిచి 13వ లోకసభలో 2004వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు.లోకసభ సభ్యునిగా గంగారెడ్డి అనేక కమిటీలలో పనిచేశాడు. ముఖ్యంగా నీటి వనురులు, పట్టణ వ్యవహారాలు, ఉపాధి, గ్రామాభివృద్ధి మంత్రిత్వ సలహాసంఘాల్లో చురుకుగా పనిచేశాడు.
 
2004లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2008లో శాసనసభకు రాజీనామా చేసి, మధ్యంతర ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి గెలుపొంది 2009 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డిచ్‌పల్లి నియోజకవర్గం నిర్మూలించబడింది. 2009లో తెరాస పార్టీ నిజామాబాదు లోకసభ అభ్యర్ధిత్వాన్ని ఆశించిన గంగారెడ్డికి నిరాశ ఎదురై, తెరాసను వదిలి కాంగ్రేసు పార్టీలో చేరాడు.<ref>[http://www.hindu.com/2009/03/28/stories/2009032853150400.htm TRS finalises candidates for 42 Assembly seats - The Hindu Mar 28, 2009]</ref> 2012లో గంగారెడ్డి కాంగ్రేస్ పార్టీని వీడి [[వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్ కాంగ్రేస్]] పార్టీలో చేరాడు.<ref>[http://54.243.62.7/breakingnews/article-71979 అధైర్యపడవద్దు - విశాలాంధ్ర 10 జనవరి 2012]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/గడ్డం_గంగారెడ్డి" నుండి వెలికితీశారు