"కోహినూరు వజ్రం" కూర్పుల మధ్య తేడాలు

Kiran murthy (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 689274 ను రద్దు చేసారు
చి (Bot: Migrating 36 interwiki links, now provided by Wikidata on d:q212797 (translate me))
(Kiran murthy (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 689274 ను రద్దు చేసారు)
[[గోల్కొండ]] రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు<ref>ఘనమైన మరియు ప్రసిద్ధిగాంచిన వజ్రాలు; http://www.minelinks.com/alluvial/diamonds_1.html </ref>. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన [[మాలిక్ కాఫుర్]] తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.<ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 2006, ISBN 0-521-80904-5, p. 40 </ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0-415-15482-0</ref>.
 
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు[5].
 
ఈ అసాధారణ వజ్రం ఎన్నో రాజ్యాలను కూల్చింది. ఎందరో రాజులను మార్చింది. చివరికి బ్రిటిష్‌ రాణి తల మీద చోటు సంపాదించింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఆ వజ్రం పేరు 'కోహినూర్‌'. [[బాబర్‌ నామా]]లో మొఘల్‌ చక్రవర్తి [[బాబర్]]‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. మాల్వా రాజు [[మహలక్ ‌దేవ్]]‌ దీని తొలి యజమానిగా చరిత్రకెక్కాడు. తర్వాత మాల్వాను జయించిన [[ఢిల్లీ]] పాలకుడు [[అల్లావుద్దీన్‌ ఖిల్జీ]] దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం [[బాబర్]]‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన [[నాదిర్ షా]] ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.
1,737

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867084" నుండి వెలికితీశారు