హాలహర్వి సీతారామరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హాలహర్వి సీతారామరెడ్డి''', [[రాయలసీమ]]కు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. [[బళ్ళారి]] నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు మరియు శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు.
 
సీతారామరెడ్డి, 1900, మే 14న అప్పటి బళ్ళారి జిల్లాలోని [[హాలహర్వి]]లో జన్మించాడు. ఈయన తండ్రి బొజ్జి రెడ్డి. సీతారామరెడ్డి మద్రాసులోని [[పచ్చయప్ప కళాశాల]]లో బీ.ఏ పట్టభద్రుడై, లా కళాశాల నుండి బీ.ఎల్ పట్టా పుచ్చుకున్నాడు. 1930లో మద్రాసులో న్యాయవాదిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన సీతారామరెడ్డికి గోవిందమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు.<ref>[http://books.google.com/books?id=kZY5AQAAIAAJ&q=halaharvi+sitaram+reddy Who's who, Issue 1 India. Parliament. Lok Sabha]</ref> 1937లోనూ, తిరిగి 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు.
 
బెంగుళూరు కాఫీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు. రాయలసీమ అభివృద్ధి సంఘం అధ్యక్షునిగా ఉన్నాడు. ఆంధ్రోధ్యమంలో చురుకుగా పనిచేసిన సీతారామరెడ్డి 1937లో [[కడప కోటిరెడ్డి]] అధ్యక్షతన విజయవాడలో జరిగిన రజతోత్సవ [[ఆంధ్ర మహాసభ (ఆంధ్ర)|ఆంధ్ర మహాసభ]]లను ప్రారంభించాడు.<ref>[http://books.google.com/books?id=v4wBAAAAMAAJ&q=halaharvi+sitaram+reddy History of Modern Andhra - P. R. Rao]</ref> రాయలసీమ నేతగా [[శ్రీబాగ్‌ ఒడంబడిక]]లో కూడా పాల్గొన్నాడు. 1960 నుండి బెంగుళూరు కాఫీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=8gkPAQAAIAAJ&q=h.+sitarama+reddy Indian Coffee: Bulletin of the Indian Coffee Board, Volume 24, Issues 7-12]</ref> 1962లో [[ఆదోని శాసనసభ నియోజకవర్గం|ఆదోని నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
 
==మూలాలు==