న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==రేడియో అన్నయ్య==
పాఠశాల చదువు అనంతరం [[విజయనగరం]] లోని [[మహారాజ కళాశాల]] లో డిగ్రీ పూర్తిచేసి [[మద్రాసు]] లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. [[ఆకాశవాణి]] లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. ఆ రోజుల్లో బీ.బీ.సీ లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు రేడియో ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణస్యం తీసుకుంది. మద్రాసు రేడియోలో పిల్లల కార్య క్రమాలను దుర్గాభాయ్ దేశముఖ్ నిర్వహించేవారు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు [[రేడియో అన్నయ్య]] గా పేరొందారు. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి [[న్యాయపతి కామేశ్వరి]] అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి [[రేడియో అక్కయ్య]] గా పేరొందారు. రేడియోలో వారు ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించారు.
 
'''ఆటవిడుపు''' కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాలలోపు పిల్లలకి శనివారం [[బాలానందం]] అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆతృతగా వేచి చూసేవారు.
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు