వై.రుక్మిణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వై.రుక్మిణి''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు [[వై.వి.రావు]] భార్య. ఈమె తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించినది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] కూడా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటించినది.
 
రుక్మిణి 4 సంవత్సరాల వయసులోనే [[హరిశ్చంద్ర]] చిత్రముద్వారా సినీరంగములో బాలనటిగా అడుగుపెట్టి 40కి పైగా సినిమాలలో బాలనటిగా పనిచేసినది. రుక్మిణి కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏవియం పతాకంపై టి.ఆర్.మహాలింగం తీసిన శ్రీవల్లి. రుక్మిణి తల్లి [[నుంగంబాక్కం జానకి]], తొలి తరం తమిళ సినిమా నటి మరియు నర్తకి. లవంగి చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్రానికి దర్శకుడైన వై.వి.రావును ప్రేమించి పెళ్ళి చేసుకుంది.<ref>[http://www.hindu.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm A revolutionary filmmaker- The Hindu Aug 22, 2003]</ref>
 
ఈమె నటించిన తమిళ చిత్రాలలో ''వెన్నిరాదై'', ''కప్పలొతీయ తమిళన్'', ''రోజావిన్ రాజా'', ''మనియొసై'' మరియు ''ఇదయకమలమ్'' కొన్ని ప్రముఖమైన చిత్రాలు. తెలుగు సినిమా రంగములో ఈమె [[ఎన్టీ రామారావు]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]]లు ఇరువురితో కలిసి నటించినది. హిందీలో ఈమె కొన్ని చిత్రాలలో నటించడమే కానీ కొన్ని చిత్రాలను నిర్మించినది కూడా. హిందీలో రుక్మిణి నిర్మించిన సినిమాలలో ''లవంగి'' మరియు ''మంజరి'' సినిమాలు చెప్పుకోదగినవి.
"https://te.wikipedia.org/wiki/వై.రుక్మిణి" నుండి వెలికితీశారు