వేగుంట మోహన ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వేగుంట మోహన ప్రసాద్''' (05 జనవరి 1942 - 03 ఆగస్ట్ 2011) ప్రముఖ సాహితీ వేత్త....... ,బహుముఖ ప్రజ్ఞాశాలి. , ''మో '' గా చిరపరిచితుడు. (ప్105)
==వేగుంట మోహన ప్రసాదు==
==జీవిత విశేషాలు==
[[గుంటూరు]] సమీపంలో లాం గ్రామంలో [[1942]] , [[జనవరి 5]] న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు జన్మించారు.ఆంగ్ల సాహిత్యంలో ఎం. ఏ. చెశారు. విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా పని చేశారు.సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.
==సాహితీవేత్తగా==
ఆయన వ్రాసిన మొట్టమొదట కవిత "హిమానీహృది" 1960 మే నెల భారతి పత్రికలో ప్రచురించబడినది. [[మహారాష్ట్ర]] లో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ ‘చితి-చింత’ (1969) '''మో''' కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. తెలుగు పాఠకులకు 1969లో ‘చితి-చింత’ కవితా సంపుటితో మో పరిచయమయ్యారు. 1970 దశకం దాకా ఉన్న కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయాలన్న తపనతో ‘ది టెన్స్ టైమ్’ను ప్రచురించారు.కరచాలనం గ్రంథం (1999), రహస్తంత్రి కవితా సంపుటికి మంచి పేరువచ్చింది. బతికిన క్షణాలు (1990), పునరపి (1993), సాంధ్యభాష (1999), వెనె్నల నీడలు (2004) కవితాసంపుటాలు అపురూప కవిగా స్థిరపరిచాయి. ఈ మధ్య ఖాదర్ మొహియుద్దీన్ -టిఎస్ ఇలియట్ ‘వేస్ట్‌లాండ్’ను చవిటిపర్ర (2011) పేరిట చేసిన అనువాదానికి ‘మో’ టీకా-టిప్పణి సమకూర్చారు. ఆత్మశ్రీయ ధోరణికి పెద్దపీట వేస్తూనే స్వాప్నికునిగా అనే్వషకునిగా తెలుగు సాహిత్యంపై ‘మో’ చెరగని ముద్ర వేశారు.
 
 
ప్రముఖ సాహితీ వేత్త....... బహుముఖ ప్రజ్ఞాశాలి. ''మో '' గా చిరపరిచితుడు. (ప్105)
 
==సూచికలు==
{{మూలాలజాబితా}}
 
 
 
==యితర లింకులు==
* [http://muppidies.blogspot.in/2011/09/05-1942-03-2011.html "మో" గురించి]
* [http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=24505&Categoryid=1&subcatid=18 ఆయన కవిత్వం]