తిరుప్పరంకుండ్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తిరుప్పరంకుండ్రం తమిళనాడు లో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్థంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్థంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు. అక్కడ అందరూ వెన్న ముద్దలతో అమ్మ వారికి పూజ చేస్తారు. అది ఎందుకో మాకు కొంత భాష రాకపోవడం వల్ల తెలుసుకోలేక పోయాము. మరొక స్థంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది.
ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వాహనం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది. పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి.
==ఈ క్షేత్రమును చేరే మార్గములు==
తిరుచెందూర్ తమిళనాడు లోని మధురై సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్ ద్వారా: చెన్నై - 450 Km, బెంగళూరు – 470 Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి మధురై కి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్, ఇది మన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లాంటి ట్రైన్. చెన్నై లో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మధురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 Km), అది కాక జాతీయ విమానాశ్రయము మధురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 Km దూరంలో ఉంది.
 
==వసతి సదుపాయము==
ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/తిరుప్పరంకుండ్రం" నుండి వెలికితీశారు