గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 11:
 
==గొరవయ్యలకు సంభందించి పురాణ ఐతిహ్యం==
భూలోకంలో మణి, మల్లాసురులను రాక్షసులు ప్రజలను హింసించేవారు. శివుడు ప్రజలను రక్షించడానికి మైలారదేవుని అవతారం ధరిస్తాడు. మణి మాలాసురులను సమ్హరించడానికిసహరించడానికి మైలారదేవుడు విచిత్రమైన వేషంతో వస్తాడు. ఈ వేషం ఇప్పటి గొరవయ్యలు ధరించేదే. పాదాలకు తగిలే విధంగా కంబలితో తయారైన గౌను, తలపైన ఎలుగుమంటి చర్మంతో దట్టమైన వెంట్రుకలున్న ఎత్తయిన టోపి, కుడిచేత డమరుకం, ఎడమ చేత గంట, త్రిశూలం, పిల్లన గ్రోవి, ముఖంపైన విభూది రెఖలు - ఈ వేషంతో మైలార దేవుడు మణి మల్లాసురులను చంపుతాడు.
 
 
మైలారదేవుడు తన భార్యతో సరసాలాడుతుండగా ఒకరోజు చిన్న వాదు మొదలవుతుంది. వారికున్న ఆరు కుక్కల గణంలో ఒకటి భార్య పక్షం, మరొకటి మైలాసురుని పక్షం. వారి దగ్గరున్న గొలుసులను ఏ గణం తెంపుతుందోనని వాదులాట, పందెం వేసుకున్నారు. పందెంలో మైలార దేవుని భార్య పక్షమే గెలుస్తుంది. ఈ గొలుసును తెంపడాన్ని సర్పిణి పందెం అంటారు. కర్నూలు జిల్లా గట్టు మల్లయ్య కొండలో దసరా రోజుల్లో ఈ పందెం ఇప్పటికీ జరుగుతుంది. పందెం ముగిసాక ఆరు కుక్కలు ఒక దొన్నెలోని పాలు పోట్లాడుకుంటూ తాగుతాయి. దీనిని ఒగ్గు సేవ అంటారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో గొరవయ్యలను ఒగ్గప్పలంటారు. ఈ పేరు రావడానికి వీరి ఒగ్గు సేవే కారణం కావచ్చు. మరో కథలో మైలార దేవుడు రాక్షసులను చంపిన తరువాత అతని ఉగ్రరూపం నుండి శాంతింపచేయడానికి గొలుసులతో బంధిస్తారు. స్వామి గొలుసులను తెంచుకున్న తరువాత ప్రసాద నైవేద్యాలతో శాంతింపచేసినట్లు ఆ సంధర్భంలో ఒగ్గు సేవ చేసుకున్నట్లు ఉంది.
 
==గొరవయ్య దీక్ష==
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు