రవిబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''రవిబాబు ''' ఒక తెలుగు సినీ నటుడు మరియు పేరొందిన దర్శకుడు. ఇతను ప్రముఖ తెలుగు నటుడు [[చలపతిరావు]] కుమారుడు.
==సినీ ప్రస్థానం==
సినిమాలలో ప్రతినాయకుడిగా నటప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత అమెరికా వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. [[అల్లరి నరేశ్|నరేష్]] ని పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం [[అల్లరి (సినిమా)|అల్లరి]] మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత నరేష్ పేరు [[అల్లరి నరేష్]] గా స్థిరపడింది. తర్వాత అదే చిత్ర కోవలో తీసిన [[అమ్మాయిలు అబ్బాయిలు]], [[సోగ్గాడు]] మరియు [[పార్టీ]] చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాయి.
 
[[పార్టీ]] చిత్రం తర్వాత తన పంధా మార్చి సస్పెన్స్ మరియు హారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ పరంపరలో తీసిన [[అనసూయ (2007 సినిమా)|అనసూయ]] సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత ప్రేమ కథాచిత్రమైన [[నచ్చావులే]] చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. తర్వాత వశీకరణ ప్రక్రియ ముఖ్యాంశంగా తీసిన [[అమరావతి]] చిత్రం పరాజయం పాలైంది. తర్వాత తీసిన ప్రేమకధా చిత్రం [[మనసారా]] కూడా విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఈ చిత్ర ప్రమాణాలు అత్యున్నత స్థాయులో ఉండటం వలన ఇది రవిబాబు చిత్రాల జాబితాలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. తర్వాత దర్శకత్వం వహించిఒన చిత్రం [[నువ్విలా]] ద్వారా రవి ఆరు మంది నూతన నటీ నటులను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. తర్వాత హారర్ సబ్జెక్ట్ ప్రధానాంశంగా తీసిన [[అవును]] చిత్రం ఇతని దర్శకత్వ చరిత్రలో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాల ద్వారా రవిబాబు తాను ప్రేమకధ మరియు హారర్ సబ్జెక్టులను బాగా తీయగలనని చెప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.
===నటుడు===
*[[స్వామిరారా]]
"https://te.wikipedia.org/wiki/రవిబాబు" నుండి వెలికితీశారు