శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం: Shyamasastri.jpg|250px|right|thumb|శ్యామశాస్త్రి]]
 
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''శ్యామశాస్త్రి''' ( ఏప్రిల్ 26 , 1762 - ఫిబ్రవరి 06 , 1827 ) [[తిరువారూరు]] గ్రామస్థుడు. ఈయన అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము, ముద్దుగా ''శ్యామకృష్ణా'' యని పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
 
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు