యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
==వివిధ రంగాలలో విశేష పరిశోధనలు==
నాయుడమ్మ ఖనిజాలు, మొక్కలు, ఆల్డిహైడ్స్ మొదలైన వాటి కలయిక నిర్మాణ శైలి రంగాలలో కూడా విశేష పరిశోధనలు చేశారు. ఇవన్నీ తోళ్ళు పదును చేసే వినూత్న ఏజంట్స్ గా వివరించి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. "జన్మచేత రైతును, వృత్తిచేత అస్పృశ్యుడిని" అని తమ చర్మ శాస్త్ర సాంకేతిక పరిశోధనా వృత్తిని గురించి అప్పుడప్పుడు చమత్కరించేవారు. ఈయన పరిశోధనా కృషి ఫలితంగా మన దేశపు చర్మ తయారీ వస్తువులు అనేక వాటికి విదేశాలలో విశేషమైన ఆదరణ, గిరాకీ ఏర్పడ్డాయి. అంతేకాదు విజ్ఞాన వినిమయ కృషిలో అలీన దేశాలకు, ఇతర దేశాలకూ మధ్య రమణీయ సేతువుగా రూపొందారు. ప్రారంభం నుంచి మద్రాసు సి.ఆర్ ఆర్.ఐ లో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు. దాని అభివృద్ధికి అహరహం శ్రమించారు. సంస్థ లోని వివిధ ప్రయోగ శాలలకు నూతన రూపు రేఖలు దిద్దారు. నూతన లాబరేటరీలను ప్రణాళికలను వేసి, డిజైన్ రూపకల్పన చేసి, స్థాపించజేశారు. అత్యాధునిక శైలిలో తోళ్ళ పదునుకు, శుద్ధికి పైలట్ ప్లాంట్ లను దేశ స్థాయిలో తొలిసాగిగా నెలకొల్పడానికి దోహదపడ్డారు. లెదర్ సైన్స్ మాసపత్రిక కు చాలాకాలం సంపాదకులుగా ఉన్నారు.
 
ఈయన 1975 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ , ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థల ఫెలోషిప్ లను అందుకుని పరిశోధనలలో అగ్రగామిగా భాసిల్లారు. దేశ, విదేశ ప్రఖ్యాత సంస్థలలో గౌరవ సభ్యత్వాన్ని అందుకున్నారు. అమెరికన్ లెదర్ కెమిస్ట్స్ అసోషియేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్, సొసైటీ ఆఫ్ లెదర్ ట్రేడ్ కెమిస్ట్స్ (బ్రిటన్) మొ.. సంస్థలలో గౌరవ సభ్యులుగా ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్కు, అసోషియేషన్ ఆఫ్ లెదర్ కెమిస్ట్స్ మొదలగు ప్రసిద్ధి చెందిన సంస్థలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇంటటి ఘనతరమైన హోదాలను నిర్వహించినప్పటికీ, సమావేశాలలో ఇతర సభలలో అపరిచితులతో సందర్బవశాత్తు "నా పేరు నాయుడమ్మ అంటారండీ" అని అతి సాధారణంగా తనను తాను పరిచయం చేసుకునేవారు. ఎంతటి వారినైనా ఈయనలోని నిరాడంబరత్వం, నిశిత మేధస్సు, విషవివేచనానుభవం ఇట్టే ఆకట్టుకునేవి.
==ప్రభుత్వ గౌరవ సలహాదారుగా==
ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈయనను రాష్త్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈయనను గౌరవ పదవిలో కొనసాగిస్తూ ఈయన పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు.
 
==పదవులు, పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు