యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
ఈయన లోని నిశిత మేధా శక్తిని, నిరాడంబరతను గుర్తించిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈయనను రాష్త్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుగా నియమించి గౌరవించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈయనను గౌరవ పదవిలో కొనసాగిస్తూ ఈయన పరిణతను, సుదీర్ఘ అనుభవసారాన్ని వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు.
మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, సైన్స్, టెక్నాలజీలను ఉపయోగించి, వెనుక బాఅటుతనాన్ని (ఆర్ధికంగా) రూపుమాపేందుకు వెనుకబడిన జిల్లాల దత్తత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అనూహ్యంగా సత్ఫలితాలను సధించిన ఈ కార్యశీలి పలు విశిష్ట గౌరవాలు అందుకున్నారు.
==వ్యక్తిత్వం==
"సామాన్య మానవుని కోనం విజ్ఞాన శాస్త్రం" అనే ఉత్తమ సదాశయాన్ని ఆచరణలోకి తెచ్చిన ఉదాత్తుడైన నాయుడమ్మ గొప్ప వైజ్ఞానికుడు, విద్యావేత్త, చదువులు ముగించుకొని ఉద్యోగాలలో ప్రవేశించిన తర్వాత కాస్త మంచి జీతమే వస్తుందనుకోగానే సంవత్సరములో ఒక నెలజీతం అందుబాటులో ఉన్న పేద విద్యార్థులకు కేటాయించారు. ఈ సహాయమును దానంగా పరిగణించనూలేదు. తాను సహకరిస్తున్నట్లుగా అన్యులెవరికీ తెలియకుండా గుప్తంగా అందిస్తూ వచ్చారు. ఇంటటి ఉదార మనస్తత్వం వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నట్లుగా ఆరోపణలు లెకపోలేదు. ఇంగ్లీషు భాషను రమణీయంగా, తెలుగును మరింత తియ్యదనంతో మాట్లాడేవారు. పరిశోధనలు, ఉద్యోగాలకు సంబంధించిన తమ అనుభవాలను సన్నిహితులకు వివరించడంలో కూడ వైజ్ఞానిక సరళిని అనుసరించేవారు. ఈయనతో ఒకసారి సంభాషనలు జరిపినవారు కూడా తమ జీవితంలో ఒక మధుర స్మృతిగా, చిరకాల స్మరణీయ సంఘటనగా మరచిపోలేదు.
 
==పదవులు, పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు