బ్రహ్మాజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==సినీరంగ ప్రవేశం==
బ్రహ్మాజీ స్వస్థలం [[తూర్పు గోదావరి జిల్లా]] [[సామర్లకోట]]. తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగరీత్వా [[హైదరాబాదు]]లో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా [[పశ్చిమ గోదావరి]] జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు. చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. [[శంకరాభరణం]] సినిమాలో నటించిన [[సోమయాజులు]]కు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు. మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఏ.ఎం.ఐ.ఈ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.<ref>[http://www.youtube.com/watch?v=FlkRy-sh1uY Interview With Brahmaji (Part 1) - Cinigoer.com]</ref> ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది.
ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.<ref>[http://www.youtube.com/watch?v=n3Q1hlVib3Y Brahmaji - Nenu Na Prayanam - Tv9]</ref>
 
కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా విజయవంతమై మంచి దర్శకునిగా నిలదొక్కుకున్న తరుణంలో బ్రహ్మాజీని కథానాయకునిగా పెట్టి సింధూరం సినిమా తీశాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాజీ" నుండి వెలికితీశారు