"బి.విఠలాచార్య" కూర్పుల మధ్య తేడాలు

చి
 
 
స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్‌ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో [[అక్కినేని నాగేశ్వరరావు]]తో ‘[[బీదలపాట్లుబీదల పాట్లు]]’ తీశారు. తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుంది’ అని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు విఠలాచార్య. ‘ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరం’ అన్నది ఆయన చెప్పిన నీతి.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/88497" నుండి వెలికితీశారు