ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==ఉరుము నృత్యం==
[[అనంతపురం జిల్లాకేజిల్లా]]కే ప్రత్యేకమైన జానపద కళారూపం [[ఉరుము నృత్యం]]. అనంతపురం జిల్లాలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఈ వృత్తితో జీవనం సాగిస్తున్నారు. బృంద నృత్యానికి చెందిన ఈ కళారూపం కులపరమైనది కూడా. [[మాల]] తెగకు చెందిన వారి జీవన వృత్తి ఉరుము నృత్యం. జానపద కళారూపాలలో చాలా కళలు దైవారాధనలో భాగంగా వృత్తివిద్యలయ్యాయి. ఉరుము నృత్యం కూడా దైవారాధనలో వృత్తి విద్యగా మారిందే. మాల తెగలో ఉరుము వాయించే వీళ్ళను ఉరుములోళ్ళు అంటారు. ఉరుములోళ్ళు చెన్నకేశవుని వారసులమని మాచెర్ల గోత్రీకులమని చెప్పుకుంటారు.
 
 
పంక్తి 9:
*అర్జున అర్జున ఫల్గుణా
*అర్జున మొండిగోడ కింద
*ముండమోపులున్నారు బద్రం అర్జున... అనే మాటలు వినిపిస్తాయి. [[అర్జునుడు]] ఇంద్రుని కుమారుడు. ఇంద్రుడు మేఘాలకు అధిపతి. వర్షం వచ్చే సమయంలో అర్జునుడి రధం వస్తుందని అ రధ చక్రాల అదురులు ఉరుములుగా వస్తాయని గ్రామీణుడి నమ్మకం. ఇప్పటికి ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది. ఈ శబ్ధం భయంకరమైనది అయినా దీనిని అనుసరించి చేసే నృత్యం ఆకర్షణీయంగా, హృద్యంగా ఉంటుంది.([[డా. చిగిచర్ల కృష్ణా రెడ్డి]]; జానపద నృత్య కళ) మతపరమైన కర్మ కాండతో ముడిపడి ఉన్న సాంప్రదాయ కళలు ఏదో ఒక మతానికి కట్టుబడి ఉంటాయి. ఉదాహరణకు గొరవయ్యల నృత్యం శైవ మతారాధనలో భాగమైంది. కానీ ఉరుములోల్లూ మాత్రం అన్ని మతాల దేవతలను ఆరాధిస్తారు.
 
 
ఉరుముల వారిని అక్కమ్మ దేవతల ప్రతిరూపంగా భావిస్తారు. దైవ సమానంగా భావించి ఆ దేవతలను పూజించే సమయంలో వారి కాళ్ళు కడిగి పాదాభివందనం చేస్తారు. నిండు కుండలోని అన్నం ఇంటి ముందుకొచ్చిన ఉరుములోల్లకు భోజనం పెడ్తారు. ఉరుములోల్లు బీజాక్షరాలతో వారిని దీవించడం కనిపిస్తుంది. ఈ బీజాక్షరాల వాక్కులు మూడు. 1. [[అమృత వాక్కు]] 2. [[విషవాక్కు]] 3. [[వేదవాక్కు]].
 
 
==ఉరుము వాద్య నిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు