"గొరవయ్యలు" కూర్పుల మధ్య తేడాలు

8 bytes added ,  8 సంవత్సరాల క్రితం
</poem>
==ఒగ్గు సేవ==
ఒగ్గు సేవ అంటే దొన్నెలలోని పాలను కుక్కలలాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగడం. గొరవయ్య దీక్షను తీసుకున్న వారు శివరాత్రి రోజున లేదా మైలార, మాళవికల కళ్యాణం రోజున ఈ ఒగ్గు సేవ చేస్తారు. ఒగ్గుసేవకు ముందు [[సర్పిణి పందెం]] ఉంటుంది. అంటే గొలుసు తెంచడం, భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దొణెలలో పోసి ఈ గిన్నెలను ఒక వలయాకారంగా ఉంచుతారు. లేదా వరుసగా ఎడమెడమగా వరుసగా ఉంచుతారు. ఈ దోనెల చుట్టూ [[డమరుకం]] వాయిస్తూ తిరుగుతూ గంట కొడుతూ కుక్కలవలె వొంగి అరుస్తూ, మెడలపై కరచుకుంటారు. ఈ దృశ్యం పిల్లలకే కాదు పెద్దలకు కూడా భయం కలిగిస్తుంది. ఒగ్గు సేవ తరువాత దోనెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివ ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తారు. పురాణ కథలోని ఆరు కుక్కలకు ప్రతీకగా ఒకప్పుడు ఆరుమంది పాల్గోనేవారు. కానీ ఇప్పుడు ఒగ్గు సేవలో పల్గొనే గొరవయ్యలకు సంఖ్యానియమం లేదు. ఒగ్గు సేవ చేస్తున్నప్పుడు కుక్కలవలె అరవడంచేత వీరిని మైలారం కుక్కలు అని కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. కడప జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటికీ వీరిని ఒగ్గులప్పలు, మైలారం కుక్కలు అనే పేర్లతోనే పిలుస్తున్నారు. దసరా పండుగ రోజు గట్టు మల్లయ్య కొండలో వివిధ పద్దతులతో పాడుతూ నాట్యం చేస్తారు. వారి శరీరం నుండి రక్తాన్ని తీసి ధార పోసి దేవునికి నైవేద్యం చేస్తారు. వీరి నాట్య పద్దతి కూడా విచిత్రంగా ఉంటుంది.
 
==నృత్య కళ==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/885736" నుండి వెలికితీశారు