ధర్మపత్ని (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ధర్మపత్ని(1969 సినిమా)]] కూడా చూడండి.

{{సినిమా|
name = ధర్మపత్ని|
year = 1941|
image = Dharmapatni 1941.JPG |
starring = [[భానుమతి]],
[[శాంతకుమారి]],
[[కాళ్ళకూరిఉప్పులూరి హనుమంతరావు]],
[[హేమలత]],
[[కె.లక్ష్మీనరసింహారావు]],
[[ఆచారి]],
[[ఆదినారాయణ]],
[[పెద్దాపురం రాజు]],
[[అక్కినేని నాగేశ్వరరావు]]|
story = వి.ఎస్.ఖండేకర్|
screenplay = |
Line 25 ⟶ 24:
budget = |
imdb_id = tt0255924}}
'''ధర్మపత్ని''', 1941లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/dharmapathni-1941/article2421779.ece DHARMAPATHNI (1941) - m. l. narasimham - The Hindu September 4, 2011]</ref> [[కొల్హాపూర్‌]]లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు [[ఉప్పులూరి సంజీవరావు]] కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన 'భీష్మ ప్రతిజ్ఞ', 'వందేమాతరం' సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి భీమవరంలో మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/81460.html అలనాటి ఆణిముత్యం: ధర్మపత్ని (1941) - ఇండియా గ్లిట్జ్]</ref>

మొదట సంభాషణల రచయితగా [[విశ్వనాథ సత్యనారాయణ]] ఎంపికయ్యారు. కానీ ఆయన సంభాషణలు మరీ గ్రాంధికంగా ఉండటంతో శరత్‌చంద్ర ఛటర్జీ నవలల్ని తెలుగులో అనువదించిన [[చక్రపాణి]]ని మాటల రచయితగా పరిచయం చేశారు. అదివరకు హిందీ, మరాఠీ సినిమాలకు పనిచేసిన అన్నాసాహెబ్ మైంకర్ సంగీతం సమకూర్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో ఆయన కనిపిస్తారు.

==కథాంశం==
రాధకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి చనిపోతుంది. పోతూ పోతూ రాధని శ్రీదేవి అనే దేవదాసి చేతుల్లో పెడుతుంది. తాను దేవదాసి పని మానేసి మంచి జీవితం గడుపుతానని రాధ తల్లికి మాటిస్తుంది శ్రీదేవి. గృహిణికి ఉండాల్సిన లక్షణాల గురించి చిన్నపిల్ల రాధకు బోధిస్తుంది శ్రీదేవి. స్కూల్లో రాధ, మోహన్ స్నేహితులవుతారు. వారితో పాటు ఆ స్నేహం పెరిగి ప్రణయంగా మారుతుంది. ఆమెని గుడికి తీసుకెళ్లి దేవును ముందు రాధను తన 'ధర్మపత్ని'గా స్వీకరిస్తాడు మోహన్.

ఓ దేవదాసి కూతురితో తన కొడుకు తిరుగుతున్నాడనే సంగతి విలన్ ఆనందరావు ద్వారా మోహన్ తండ్రికి తెలుస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఉమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందిగా కొడుకు మీద ఆయన ఒత్తిడి తెస్తాడు. పెళ్లయ్యాక తన పట్ల మోహన్ అనాసక్తిగా ఉండటానికి రాధ పట్ల అతనికున్న ప్రేమేనని తెలుసుకున్న ఉమ అతన్ని విడిచి వెళ్తుంది. ఆనందరావు ట్రాప్ నుంచి ఉమను కాపాడుతుంది అతని వల్ల అప్పటికే మోసపోయిన లీల.

లీలను హత్యచేసి ఆ నేరం మోహన్ మీద పడేట్లు చేస్తాడు ఆనందరావు. మోహన్‌ని రక్షించడానికి అతను నిరపరాధి అని చెప్పే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పిన ఆనందరావు వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకుంటుంది రాధ. చివరకు నిజం బయటపడి మోహన్ జైలునుంచి విడుదలవుతాడు. అతని తల్లిదండ్రులు రాధను చేరదీస్తారు. తన తప్పు తెలుసుకుని తిరిగి మోహన్ వద్దకు చేరుకుంటుంది ఉమ.

==తారాగణం==
* శాంతకుమారి (రాధ),
* ఉప్పులూరి హనుమంతరావు (మోహన్),
* భానుమతి (ఉమ),
* రాళ్లబండి కుటుంబరావు (ఆనందరావు),
* బేబీ లక్ష్మి (బాల రాధ),
* మాస్టర్ కుమార్ (బాల మోహన్),
* పెద్దాపురం రాజు (శ్రీదేవి),
* చలపతిరావు,
* అక్కినేని నాగేశ్వరరావు,
* ఆదినారాయణయ్య,
* నారీమణి,
* సుశీల.

==సాంకేతిక వర్గం==
* కథ: వి.ఎస్. ఖండేల్కర్
* మాటలు: చక్రపాణి
* పాటలు: దైతా గోపాలం
* సంగీతం: అన్నాసాహెబ్ మైంకర్
* ఛాయాగ్రహణం: ఎస్.కె. పాయ్
* కూర్పు: బాబూరావ్ బరోద్కర్
* కళ: హెచ్.ఎస్. గంగ్ నాయక్
* నిర్మాత, దర్శకుడు: పి. పుల్లయ్య
* బేనర్: ఫేమస్ ఫిలిమ్స్
* విడుదల తేది: 10 జనవరి

==మూలాలు==
{{మూలాలజాబితా}}