కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
 
##################
;రామప్పగుడిలో రమణీయ నృత్యాలు:
 
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్లుకు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి. ఈ కాకతీయ శిల్పచాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది
 
రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన నృత్తరత్నావళిలో ఉదాహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ వుంది.
 
;ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు:
 
పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్న దేవాలయంలోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీద మార్థంగికురాండ్ర శిల్పాలున్నాయి.
 
వరంగల్లు రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్థంగికురాండ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి.
 
ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది.
 
హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి.
 
###################
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు