ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
విస్తరణ |
||
పంక్తి 1:
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''ఇడ్లీ''' ([[ఆంగ్లం]]
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి [[చట్నీ]] లేదా [[సాంబారు]] లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.<ref>http://completewellbeing.com/article/the-light-list/</ref>
పంక్తి 15:
ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు [[పల్లె]] పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.
[[బొమ్మ:Rava idli.JPG|
==తయారీ==
ఇడ్లీలు ఉడకబెట్టేందుకు ప్రస్తుతం ప్లేట్లు లభ్యమవుతున్నాయి. గతంలో వీటిని ఆవిరిపోకుండా గుడ్డతో మూత కట్టిన పాత్రల్లో (వాసెన) ఉడికించే వారు. పాత్రలో సగం వరకూ నీరు పోసి దాని అంచుకు గట్టిగా ఓ బట్ట కట్టి అందులో ఒకటే ఇడ్లీ పోసి ఉడికించే వారు. తరువాత దానిని ముక్కలుగా కోసి తినేవారు.
తమిళనాడులో ఇప్పటికీ చాలామంది పిండిని నేరుగా ప్లేటులో కాకుండా దాని మీద బట్ట వేసి పిండి మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లేట్లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాల్సిన అవసరం ఉండదు.
==పోషక విలువలు==
ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మద్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.
==విశేషాలు==
కంచి దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం బియ్యం, మిరియాలు, కొత్తిమీర, అల్లం, ఇంగువ, జీలకర్ర, తగినంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని రామస్సెరి అనే గ్రామం ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక కుటుంబం ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండుతారు. <ref>ఈనాడు ఆదివారం, 14 జులై, 2013, పుట 16</ref>
==ఇవి కూడా చూడండి==
*[[రవ్వ ఇడ్లీ]]
|