గిడుగు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించి దర్శించినదాన్ని అక్షరబద్దం చేసి పాఠకుల కళ్ల ముందుంచేందుకు రాజేశ్వరరావు తన కథల ద్వారా విశేష కృషి చేశారు. అనుభవాల్లోంచి అక్షరాల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. సమకాలిక జీవితాన్నీ, సమస్యల్నీ అనేక కోణాల్లోంచి విశ్లేషించి, కనీసం ఆటు దృష్టి నిలిపి ఆలోచింపజేసే కథలు రాయాలని, ఆ లక్ష్యం వేపు నడవాలనేది రాజేశ్వరరావు కోరిక. స్పష్టంగా, తేలికగా, సూటిగా చెప్పడంలోనే పాఠకుల హృదయానికి సన్నిహితంగా వెళ్లవచ్చని తన కథలలో నిరూపించారు. బాల్యం నుంచి ఆయనపై ప్రభావితం చేసిన మహానుభావులెంతో మంది ఉన్నా... మొట్టమొదటగా ఆయన్ను ఆకట్టుకున్న కథలు టాల్‌స్యాయివే.
==ఆయన స్వగతం==
"పిలిస్తే పలక్కుండా పోయే ఎంతటి పెంకి పిల్లాడైనా కథ చెప్తానంటే చాలు ఆగి వెనక్కి వచ్చేస్తాడు. సాహిత్య ప్రక్రియల్లో కథకుండే ప్రత్యేకత ఇది. అందుకే పంచతంత్ర కర్త విష్ణుశర్మ కథను ప్రయోజనకరంగా మలచుకున్నారు. చిన్నపిల్లలకోసం వచ్చే కొద్ది మంచి పత్రికలూ, కథల పుస్తకాలూ, పెద్దవాళ్ల చేతుల్లో తరచూ కనిపిస్తుంటాయి. యాంత్రికంగా పరుగు పందెంలా తయారైన ఈవిత గమనంలో కథకు ఉన్న ఆకర్షణా, ఆదరణా ముందు ముందు పెరుగుతుందే గాని తరగదు. అందుకనే నా ఆనందాన్ని, ఆశ్చర్యాన్నో, ఆవేదననో కథా రూపంలో అందరితో పంచుకోవాలని కోరుకుంటాని. అదో తృప్తి". అని గిడుగు రాజేశ్వరరావు ఓ పుస్తకంలో స్యయంగా స్వగతంగా రాసుకున్న పలుకులివి.
 
ఆయన తన కుమారుని యింట్లో ఢిల్లీ లో [[2013]] , [[జూలై 21]] న గుండెపోటుతో మరణించారు.