ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: మొదటి ప్యారా
→‎చరిత్ర: రెండవ ప్యారా
పంక్తి 2:
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాలు సాధారణంగా ఒక అద్దం మరియు ఒక ప్రిజం గల వ్యవస్థని ఉపయోగిస్తాయి (ఒకే అద్దం నుండి పరావర్తనం చెందటం వలన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని పేరు) . సాధారణ వ్యూ ఫైండర్ (ఎస్ ఎల్ ఆర్ కాని) కెమెరాలలో ఫోటో తీసేముందు బంధించదలచుకొన్న చిత్రానికి, ఫోటో తీసిన తర్వాత ఏర్పడే చిత్రానికి (కొద్దిపాటి నుండి చాలా) తేడా ఉంటుంది. వీటికి భిన్నంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఫోటో తీసే ముందు ఫోటోగ్రఫర్ చిత్రాన్ని ఏ విధంగా బంధించదలచుకొన్నాడో అదే విధంగా చిత్రం ఏర్పడుతుంది.
==చరిత్ర==
ఎస్ ఎల్ ఆర్ కెమెరాలకి మునుపు అన్ని వ్యూ ఫైండర్ కెమెరాలలో రెండేసి దృష్టి సంబంధిత కాంతి మార్గాలు ఉండేవి. మొదటిది కటకము (లెన్స్) నుండి ఫిలిం కు కాగా, రెండవది పైన ఉండే రేంజ్ ఫైండర్ కి. వ్యూ ఫైండర్ మరియు ఫిలిం లెన్స్ లు ఒకే కాంతి మార్గాన్ని ఉపయోగించుకోలేక పోవటం మూలాన కెమెరా ముందు వైపు ఏదో ఒక బిందువు వద్ద వ్యూయింగ్ లెన్స్ ను ఫిలిం లెన్స్ వద్ద కలపవలసి వస్తుంది. కొద్దిపాటి నుండి ఎక్కువ దూరాన ఉండే వస్తువులని చిత్రీకరించటానికి ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ లో సమస్యాత్మకం కానప్పటికీ అతి సమీపంగా చిత్రీకరించే సమయంలో లంబనం వలన ఫ్రేమింగ్ లో తప్పులు దొర్లుతాయి. అంతేకాక (తక్కువ కాంతిలో ఉన్న లేదా తక్కువ వేగం గల ఫిలిం ని ఉపయోగించేటప్పుడు) అపెర్చర్ లని వైశాల్యం పెంచటం సులభం కాదు.
 
చాలా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలు పెంటాప్రిజం (ఐదు ప్రక్కలు గల ప్రిజం) ఉపయోగించటం మూలాన నిఖార్సైన, ఖచ్చితమైన ప్రతిబింబాన్ని వీక్షణని అందిస్తుంది. కటకం ద్వారా అడ్డంగా మరియు నిలువుగా ప్రయాణించిన కాంతి తలక్రిందులుగా మారి రిఫ్లెక్స్ మిర్రర్ ద్వారా పై దిశలో పెంటాప్రిజం లోనికి పంపబడుతుంది. ఇక్కడ ఈ కాంతి పలుమార్లు పరావర్తనం చెంది తలక్రిందులైన కాంతిని సరి చేసి వ్యూ ఫైండర్ తో ప్రతిబింబాన్ని అనుసంధానిస్తుంది. షట్టర్ విడుదల చేయగానే కాంతి మార్గం నుండి మిర్రర్ తప్పుకొనగా, కాంతి నేరుగా ఫిలిం/సిసిడి లేదా సిమాస్ ఇమేజ్ సెన్సర్ పైన ప్రకాశిస్తుంది.
 
==కటక భాగాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు