గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
కొండక శిశువుకు గొబ్బిళ్ళో</poem>
 
అంటూ అన్నమయ్య తన మృదుమధురమైనమృదు మధురమైన పద జాలంతో శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుడు, కంసుణ్ణి వధించడం వంటి సాహసాలను వివిరంచడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు. ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడపిల్లలు రక రకాలుగా రంగ వల్లులను తీర్చి దిద్ది వాటిమీద ఈ గొబ్బెమ్మలను వుంచుతారు. వాటిని పశుపు కుంకాలతో పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలని, గురుగులను గొబ్బియ్యల్లనీ ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు. సంక్రాంతి సమయంలో బజారులన్నీ గొబ్బెమ్మలతో కళకళలాడుతూకళకళ లాడుతూ పుంటాయి. సంక్రాంతి పండుగ వస్తూందంటే ఆడ పిల్లలకి ఎక్కడ లేని ఆనందం. పంట పొలాలనుండుపొలాలనుండి పంటలు ఇంటికి వచ్చి ధాన్య రాసులతో కళకళ లాడుతూ వుంటాయి. పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న రైతు బిడ్డలు ఆనందోత్సవాలతో ఈ పండగను జరుపు కుంటారు. ముద్దు లొలికే ముగ్గులతో ఇళ్ళనన్నిటినీ ముగ్గులతో శోభాయ మానంగా తీర్చి దిద్దుతారు.
 
ఆడపిల్లలు ఆవు పేడను తీసుకు వచ్చి వాటిని గుండ్రంగా చేసి గొబ్బెమ్మను తయారు చేస్తారు. పై భాగాన గురుగు చేసి అందులో పువ్వులను గుచ్చుతారు. వాటిని తీసుకు వెళ్ళి ముగ్గుల మధ్య వరుస క్రమంలో సుందరంగా అమర్చుతారు. వాటికి నైవేద్యంగా పండ్లను వుంచుతారు. తరువాత రంగు రంగుల దుస్తులు ధరించినఆడపిల్లలుధరించిన ఆడపిల్లలు, అనందంగా అందరూ వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ, పాటకు తగినట్లు అడుగులు వేస్తూ, పాట గమనాన్ని బట్టి వేగాన్ని పెంచుతూ గొబ్బి పాటలను వీనుల విందుగా పాడుతూ, తమ భక్తి శ్రద్ధలను వెల్లడిస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందూ గొబ్బి పాటలు పాడుతూ వుంటే, బజారంతా శోభాయమానంగా వుంటుంది. అన్నమయ్య లాంటి వాగ్గేయకారులందరూ గొబ్బి పదాలను రచించారంటే వాటి ప్రాముఖ్యాన్ని మన గమనించ వచ్చును. రాయల సీమ ప్రాంతంలో పాడుకునే ఒక గొప్ప పదాన్ని గూర్చి, ఈ.ఎల్. ఎస్. చంద్ర శేఖర్ గారు ఇలా వివరిస్తున్నారు:
;కంచికి పోయే గాజుల సెట్టి:
 
రాయల సీమ ప్రాంతంలో పాడుకునే పాటలో కంచికి పోయి వస్తున్న గాజుల శెట్తిని ఓ భక్తురాలు కంచిలో నెలకొన్న దేవతను గురించి అడిగి తెలుసుకునే పాట ఈ విధంగా వుంటుంది.
 
<poem>గొబ్బియాలో కంచికి పోయే గాజుల శెట్టీ
గొబ్బియాలో కంచిలో మాచమ్మ ఎవరాడబిడ్డ
గొబ్బియాలో సింతాకు రాసేటి శివుని బారియ
గొబ్బియాలో మరు భూములే లేటి మంగ మరదాలు
గొబ్బియాలో గాకాకు రాసేటి రాజు కోడలు.</poem>
 
గొబ్బి అనే పదం గర్భా అఏ పదం నుంచి ఉద్బవించిందని డాక్టరు బి.రామరాజు గారు, టి దోణప్ప గారు వారి అభి ప్రాయాలను వెల్లడించారు. గర్భా అనేది ఒక నృత్య విశేషానికి సంకేతంగా వుంది. గర్భా నృత్యాలు కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో వున్నట్లు వినికిడి.
 
ఏది ఏమైనా గొబ్బిపాటలు మన గేయ సాహిత్యంలో స్థానం సంపాదించు కోవటంతో పాటు ప్రముఖ వాగ్గేయ కారుల్ని కూడా ఆకర్షించాయి.
 
కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో కామన్న కథను చంద్ర శేఖర్ గారు ఇలా వుదహరించారు.
 
కామన్న కథ:
 
కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూరుతు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టు కుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లిని వేషం ధరించి, కామన్న దగ్గరికి
 
==;కంచికి పోయే గాజుల సెట్టి:==