గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూరుతు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టు కుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లిని వేషం ధరించి, కామన్న దగ్గరికి
 
 
 
వెళ్ళాడు. అతను మారు వేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన ంహీమన్న కామన్నను వదిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో....................
 
<poem>అమ్మో రావమ్మో మము గన్న తల్లో గొబ్బిళ్ళీ
నీ ముద్దు తమ్మునకు పాడె గట్టమో గొబ్బిళ్ళో
అందరిండ్ల ముందర వాలాలాడనీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముందర కాకులాడానీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముంద నెత్తురు కాలవలె గొబ్బిళ్ళో
</poem>
 
ఇలా ఆ పాట సాగురుంది. గొబ్బి పాటల్లో పౌరాణిక గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో గొబ్బి గౌరి వ్రతం చేస్తారు. వివిధ కోర్కెలు తీర్చమని, పాటలు పాడతారు.
 
<poem>సుబ్బీ గొబ్బొమ్మా సుఖము లియ్యవే
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే.
 
మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే.. అంటు తమకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటారు.
 
అలాగే ఇంటి ముందు కళకళ లాడే ముగ్గులను వర్ణిస్తూ వాతికి దైవత్వాన్ని ఆపాదిస్తూ
 
గ్బొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ
కంచి వరద రాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..
</poem>
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈ నాడంత ప్రాముఖ్యం లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడ పిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన పట్టణాల్లో ఈ కళారూపం కనిపించ కుండా పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వునాయి గొబ్బి పాటలు.