"నేపాల్" కూర్పుల మధ్య తేడాలు

14,956 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
ఆధికారికంగా నేపాలు ప్రపంచంలో ఏకైక హిందూ దేశము. కానీ దీర్ఘ కాలంగా అక్కడి చట్టాలు బలవంతపు మత మార్పిడులను, అన్య మత విద్వేషాన్ని అడ్డుకుంటున్నాయి. 2001 లెక్కల ప్రకారం 80.6% మంది హిందువులు, 11% మంది బౌద్ధులు. కాని ఇరు మతాల వాళ్ళూ ఇరు మతాల సాంప్రదాయాలనూ, ఆచారాలనూ, సమానంగా ఆచరిస్తారు. ఇంకా 4.2% మంది ముస్లింలు, 3.6% మంది కిరాంతులనబడే వాళ్ళూ, 0.5% మంది క్రైస్తవులూ ఉన్నారు. వీరి సంఖ్య 2005 కు 6 లక్షలకు పెరిగింది.
 
 
==నేపాల్ లో ముఖ్యమైన పండగలు==
 
1 ముఖ్య పండగలు
 
నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్బంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంబ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము కలదు. దాని ప్రకారం:...............
 
పండగ దినాల్లో కూడ భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా........ యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం.................. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.
1.1 కాగ్ తీహార్
 
యమ పంచకంలో మొదటి రోజైన ఈ రోజున కాగ్ తీహార్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున అపశకునపు పక్షి అయిన కాకిని పూజిస్తారు. మానవుల మరణానికి కాకులు దూతలు బావించి ఈ రోజున ఇంట్లోని వారందరూ భోజనం చేయకుండా వుపవాసముండి, ఇంటిని దీపాలతో అలంకరించి పూజానంతరం కాకులకు అన్నం పెడతారు.
1.2 కుకుర్ తీహార్
 
రెండో రోజున కుకుర్ తీహార్ అనగా కుక్కల పండుగ . ముఖ్యంగా మరణానికి పుత్రులు గా నల్లని కుక్కలను chestnut రంగు కుక్కలను భావించి వాటిని పూజిస్తారు. వాటి ముఖానికి బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి, వాటికి మంచి ఆహారం పెట్టి పూజిస్తారు. అన్ని జంతువుల కన్న కుక్క మానవునికి అత్యంత విశ్వాస పాత్రమై నందున, మానవునికి తోడుగా వుండి, అతనికి ఇంటిని కాపలా కాస్తున్నందున ఈ విధంగా వాటికి రుణం తీర్చుకోవడంగా కూడా నేపాలీ ప్రజలు భావిస్తారు. ( సాధారణంగా భారత దేశంలో ఆలయాల లోనికి కుక్కలు ప్రవేసిస్తే అపవిత్రంగా భావిస్తారు. ఆ అపవిత్రతను తొలిగించ డానికి కొన్ని శుద్ధి కార్య క్రమాలు కూడ చేస్తారు. కానీ నేపాల్ దేశంలో ఖాట్మండులోని పరమ పవిత్ర పశుపతి నాద్ దేవాలయంలో కొందరు పూజారులు కొన్ని కుక్కలకు నొసటన పశుపు పూసి కుంకుం బొట్లు పెట్టి వాటి మెడలో పూల మాల వేసి ఒక స్థంభానికి కట్టి ఆ ప్రక్కనే ఒక పూజారి కూర్చొని వుండగా నేను గమనించాను. కుక్కలు ఆలయంలో ఈ విధంగా వుండడము చూచి ఇదేదో పవిత్రమైన కార్యమై వుంటుందని భావించి కొంత లోతుగా పరిశీలించగా..... ఆలయానికొచ్చిన భక్తులు కుక్క వద్ద వున్న పూజారికి కుక్కలకు పూజా కార్యక్రమం చేయించి వారినుండి కొంత సంభావన స్వీకరించారు. ఇది నేను స్వయంగా చూసిన విషయం. బహుశా పూజించ డానికి కుక్కలు దొరక నందున ఆలయంలో ఈవిదంగా కుక్కలను పూజించే అవకాశం కల్పించబడినదని భావించ వచ్చు. )
1.3 గోవుల పండగ
 
మూడోరోజున పశువుల పండగ జరుపు కుంటారు. (ఆంధ్ర ప్రదేశ్ లో పశువుల పండుగ లాంటిది కాదు) గోవును లక్ష్మీ ప్రతిరూపంగా భావించి పూజించడము హిందువులకు ప్రపంచ వ్వాప్తంగా వున్న ఆచారమే. హిందువు లందరూ గోమాత అవయవాలల్లో అన్ని రకాల దేవతలు కొలువై వున్నారని నమ్ముతారు. గోమాత పూజను నేపాలీలు కార్తీక పౌర్ణమి నాడు చేస్తారు. చీకటిని ప్రాలద్రోలి లక్ష్మీ దేవికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు. క్షీర సాగర మదనం లో లక్ష్మీ దేవి ఈరోజునే పుట్టిందని వీరి నమ్మిక. స్త్రీలందరినీ లక్ష్మీ దేవి అవతారులుగా ఈ రోజున భావిస్తారు. స్త్రీలు ఈ రోజున స్నానానంతరం కొత్త బట్టలు ధరించి లక్ష్మీ పూజలు చేసి bhailo పాటలు పాడుతూ ఇంటింటికి వెళతారు. ఆ ఇంటి ఇల్లాలు ...... పాటలు పాడుతూ తమ ఇంటి ముంగిటకు వచ్చిన స్త్రీలను లక్ష్మీ అవతారంగా భావించి వారిని దీపాలతో ఆహ్వానిస్తారు. ఇంట్లో కూర్చో బెట్టి ఒక పళ్ళెంలో వివిధ రకాల రొట్టెలు, పలు రకాల పండ్లు అలంకరించి అందులో కొంత డబ్బులు పెట్టి వారికి సమర్పిస్తారు. ప్రతిగా....., ఆ వచ్చిన స్త్రీలు ఆ యింటి వారిని లక్ష్మీ కటాక్షం కలిగి ధన దాన్యాలతో తులతూగాలని దీవిస్తారు. ఈ పండుగ నేపాల్ దేశంలో ప్రతి పల్లెలోను ఇప్పటికీ జరుగు తున్నది. పట్టణాలలో అంత గా లేదు.
 
నేపాల్ లోని పశ్చిమ ప్రాంతాలైన దోటి, మరియు హుమ్లా ప్రాంతాల్లో భైలే పాటలు ఐదు రోజులు పాటు పాడుతారు. అంతే గాక పుష్య మాసంలో (జనవరి-పిబ్రవరి) 20 రోజులు జరుపుతారు. దీనిని మఖ్య భైలే అని అంటారు.
1.4 ఎద్దుల పండుగ
 
నాల్గవ రోజున కూడ ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంక రిస్తారు. కాని పూజా విధానంలో ప్రజలు వారి వారి సంస్కృతిని బట్టి కొన్ని మార్పులతో జరుపు కుంటారు. సాధారణంగా ఈ రోజు అందరూ తలంటుకుని స్నానంచేసి ఎద్దులకు కూడ స్నానంచేయించి, అలంకరించి పూజిస్తారు. ఆవులను పాలు పితకరు, ఎద్దులను పనిలో పెట్టరు. శ్రీ కృష్ణున్ని పూజించేవారు ఈ రోజు గోవర్థన పూజ చేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి అనేక పశువులను, ప్రజలను రక్షించినది ఈ రోజు ఇదేనని పూజ చేస్తారు. కొందరు కొత్త తరం వారు ప్రతి మానవుని లోను దేవుడున్నాడని నమ్మి ఆత్మ పూజ చేస్తారు.
 
గోవర్థన పూజ జరిగిన రాత్రి పురుషులు భైలి లో స్త్రీలు పాటలు పాడినట్లు పాటలు పాడుతారు. (men play their carol called devsi) దీన్ని దెవ్సీ అంటారు. ఇందులో స్త్రీలకు ప్రవేశం లేదు. పట్టణ ప్రాంతాల్లో పురుషులు ఈ మార్గాన్ని ధన సంపాదనకు మార్గంగా ఎంచు కుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఈ బృంధం తాము అడిగినంత విరాళం ఇవ్వనందుకు ఇంటి వారితో వాగ్వివాదానికి దిగి అసభ్యంగా ప్ర్వర్తించడం కూడ జరుగు చున్నది. హోటళ్ళు వంటి కొన్ని వ్వాపార సంస్థలు ఈ దెవ్సీ బృంధానికి తాము ఇంతే మొత్తమిస్తామ ని బయట బోర్డులు కూడ పెడ్తారు. పరదేశీ విహార యాత్రా వాహనాలను అటవీ ప్రాంతాలలో మద్యలో ఆపి తాము అడిగి నంత ధనము ఇచ్చు నంతకు వదలరు. ఆనందానికి ఆలవాలమైన ఈ పురాతన సాంప్రదాయం కొందరి స్వార్థపరులకు ధన సంపాదన మార్గంగా మారడంతో ప్రజాభిమానాన్ని కోల్పోతున్నది.
1.5 బాయిటికా
 
ఐదవ రోజు భాయ్ టికా పండుగను జరుపు కుంటారు. యమ పంచకంలో ఇది చివరి రోజు. ఈ రోజున యమ ధర్మ రాజు తన చెల్లె లైన యమునా' ఇంటికి వెళ్ళి బోజనం చేస్తాడని వీరి నమ్మిక. స్కాంద పురాణం లోని కార్తీక మహత్యం ప్రకారం పురుషులు ఈ రోజున తమ ఇంట్లో గాక తమ చెల్లెలి ఇంట్లో భోజనం చేయాలి. చెల్లెలు లేని పురుషులు ఈ రోజు కొరకు ఎవరైనైనా దత్తత తీసుకుని వారింట భోజనం చేయాలి. ఆ అవకాశం కూడ లేనివారు ఒక చెట్టు నైనా తమ చెల్లెలుగా భావించి ఆ చెట్టు క్రింద భోజనం చేయాలి.
 
ఆ సోధరి తన అన్నకు ఆయురారోగ్యాల నందించాలని కోరి అన్నగారి నుదుట రంగు రంగుల తిలకం దిద్ది తగు బహుమతులిస్తుంది. అదే విధంగా అన్నకూడ తన చెల్లెలికి నుదుట తిలకం దీద్ది ఆమెకు భహుమతులిస్తాడు.
 
ఈవిధంగా .... హిందువులు అధికంగా వున్న నేపాల్ దేశంలో హిందూ సాంప్రదాయ పండగలు అనేకం జరుపుకుంటారు. ఇక్కడ జరుపుకునే పండగలలో కొన్ని ప్రత్యేకమైన పండగలు కూడ గమనించ వచ్చు.
(* మూల: యమ పంచక పండగల విశేషాలు... కొన్ని స్వయంగా చూసినవి. వివరాలు మాత్రం నేపాల్ లోని ఆంగ్ల దినపత్రికలైన The himalayan, and The khatmandu post )
 
== నేపాల్ పర్యటన ==
2,16,059

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/893907" నుండి వెలికితీశారు