నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 183:
ఖాట్మండు నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో వున్నది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాధాని కూడ. ఇక్కడ ఇది పెద్ద పట్టణమైనా భారత దేశంలో పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదె. భహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి డొక్కువి కూడాను. పాత జీపుల్లాంటి వాహనాలె ఇక్కడి ప్రయాణ సాధనాలు. ఖాట్మండులొ ఒక ఆకర్షన అక్కడి జూద గృహాలు. వీటిని '''కాసినొ''' అంటారు. ఇక్కడ మధ్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడు తారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడ వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడ వున్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకాన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు. ఇది కూడ అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి ఆదాయ వనరె. ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటుంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండి నట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది.
 
[[ముక్తి నాద ఆలయం]].
 
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తి నాద ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తి నాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడ కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందె. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడు కున్న పని. ముక్తి నారాయణుడు స్వయంబువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది దారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లు కుంటే నూట ఎనిమిది దివ్యదామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
 
== మనసులో అనుకొన్న కోరికలు తీర్చే మనోకామన ==[[దస్త్రం:Infront of manokamani temple at Nepal.JPG|thumb|right|మనోకామని గుడి, నేపల్]]
[[పోక్రా]] నుండి [[ఖాట్మండు కు పోయే దారిలో ఈ [[మనో మామని]] ఆలయం ఒక పెద్ద కొండపై వున్నది. బస్సు రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులోనె వున్నది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం వెలసి వున్నది. అక్కడికి వెళ్లడానికి ''రోప్ వే" ఏర్పాటు వున్నది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి. ఈ రో ప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడ వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం వున్నది. ఇది పగోడ పద్దతిలో వున్నది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసు లోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతు వధ శాల వున్నది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్త సిక్తంగా వుంటుంది. ఆ జంతువులు అనగా గొర్రెలు కూడ రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు వున్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మధ్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండ పై నుండి సుదూరంలో మంచు తో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.
[[దస్త్రం:Rope car at manokamani at Nepal.JPG|thumb|రోప్ కారు]]
== పశుపతి నాద్ ఆలయం ==
ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే [[పశుపతి నాద్ ఆలయం]]. ఇది శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిధిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్బాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగి వుంటుంది. మధ్యలో వున్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు మొఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తర తరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిర పడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమె ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది వున్నది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం వున్నది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్బ గుడికి ఎదురుగా అతి పెద్ద నంది వున్నది. ఆలయ ప్రాంగణం లో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్బ గుడిలోని శివుని పై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రం గా బావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుఖాణలాలలో ముత్యాలు, నవర్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు