స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
 
ఈ ప్రకటన బ్రిటీష్‌ ప్రెసిడెన్సీ ఏరియాలో ఆంధ్ర ప్రాంతానికి సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను తెచ్చిపెట్టింది కాని, నిజాం నవాబు తన ఆధీనంలోనున్న హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని ఆగస్టు 14న 'ఆజాద్‌ హైదరాబాదు' ను ప్రకటించాడు. ఈ ప్రకటనతో 'విలీనోద్యమం' ఆరంభమైంది. 'జాతీయ ముస్లిం సమితి' కార్యదర్శి అబ్దుల్‌ ఘని నిజాం ప్రకటన మీద స్పందిస్తూ 'ఇది వట్టి అవివేకం. అందరాని ఫలానికై ఆశించడం తప్ప మరొకటి కాదు. బ్రిటీషు పార్లమెంటు సభ్యులకు భారతదేశ వ్యవహారాలలో జోక్యం కలిగించుకునే అధికారం అణుమాత్రమయినా లేదని గ్రహించక పోవడం మిగుల శోచనీయం' అని అన్నారు. (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పేజి.478). ఆ క్రమంలో సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ ముహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌ విలీనోద్యమంలో భాస్వాయులయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో భాగస్వాములైన మగ్దూం మొహిద్దీన్‌, అలం ఖుంద్‌ విూర్‌, హసన్‌ నాసిర్‌, జవ్వాద్‌ రజ్వి, ఆఖ్తర్‌ హుస్సేన్‌, జహందర్‌ అస్ఫర్‌, కుతుబ్‌-యే-ఆలం, అహసన్‌ అలీ విూరజ్‌, విూరాజ్‌ హైదర్‌ హుస్సేన్‌, హుస్సేని షాహిద్‌ లాంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన ప్రముఖులు నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలు ఉర్దూ పత్రికలు విలీనోద్యమాన్ని సమర్థిస్తూ ముందుకు వచ్చాయి. ఈ మార్గాన మరింత సాహసంగా ముందుకు సాగిన వ్యక్తి ఇమ్రోజ్‌ ఉర్దూ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌, ప్రముఖ ఉర్దూ పండితులు ఖాజి అబ్దుల్‌ గఫార్‌ పయాం ప్రధాన పాత్ర నిర్వహించాయి. ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానాన్ని విలీనం చేయాల్సిందిగా నిజాం నవాబును కోరుతూ, హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితులను పూసగుచ్చినట్టు ఏకరువు పెడుతూ, నిజాం ప్రభుత్వంలో సుబేదార్‌గా బాధ్యతలు నిర్వహించిన నవాబు మంజూరు జంగ్‌, నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ సంచాలకులుగా పనిచేస్తున్న ముహమ్మద్‌ హుస్సేన్‌ జాఫరీ, తహసీల్దార్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఫరీద్‌ విూర్జా, బాఖర్‌ అలీ విూర్జా, ముల్లా అబ్దుల్‌ బాసిత్‌, అహమ్మద్‌ విూర్జా, హుస్సేన్‌ అబ్దుల్‌ మునీంలు సంతకాలు చేశారు. ఆ తరువాత దువ్వ డిప్యూటీ కలక్టరుగా నైజాం ప్రభుత్వం నుండి ఉపకారవేతనం పొందుతున్న ఫాయిఖ్‌ హుస్సేన్‌ కూడా అ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ, తదుపరి సంభవించే తీవ్ర పరిణామాలను కూడా ఆలోచించకుండా లేఖ విూద సంతకం చేశారు. ఈ లేఖ ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించింది. ఈ లేఖ పూర్తిపాఠం విఖ్యాత జాతీయవాది ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ సంపాదకత్వంలోని ఉర్దూ పత్రిక పయాం, 1948 ఆగస్టు 13నాటి సంచికలో ప్రకటితమైంది. ఆ వాతావరణంలో ప్రజలు విలీనం కోరుతూ ప్రముఖ కవి ముఖ్దూం మొహిద్దీన్‌ ప్రముఖ పాత్ర వహించారు. ఈ ఉద్యమాలకు సిరాజుల్‌ హసన్‌ తిర్మిజ్‌, డాక్టర్‌ అక్బర్‌ అలీ, జలాలుద్దీన్‌, హసన్‌ అహమ్మద్‌ పహిల్వాన్‌, విూర్‌ అహమ్మద్‌ అలీ ఖాన్‌, డాక్టర్‌ లతీఫ్‌ సయూద్‌, నవాబు కమాల్‌ యార్జంగ్‌, నవాబు యూసుఫ్‌ అలీ ఖాన్‌ సాలార్‌ జంగ్‌, సయ్యద్‌ అలం ఖుంద్‌ విూర్‌, ఖాజీ అబ్దుల్‌ గఫ్పార్‌, అక్తర్‌ హుసేన్‌, జవ్వాది రజ్వీ లాంటి ప్రముఖులు విలీనం డిమాండ్‌ను సమర్థించారు. ఈ పోరాటంలో భాగంగా సాగిన ఆందోళనలో విద్యార్థి నాయకులు జకీర్‌ అలీ మీర్జా అరెస్టయ్యారు. ఆయనను చాలాకాలం గృహ నిర్బంధంలో ఉంచారు. అటు 'ఆజాద్‌ హైదరాబాద్‌' ను కలగంటున్న నిజాం నవాబు ఇండియన్‌ యూనియన్‌లో నైజాంను విలీనం చేయడానికి ససేమిరా అంటుండగా నైజాం సంస్థానం సరిహద్దుల్లో గల ప్రాంతాలు ఒక్కొక్కటిగా స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకోవడం ఆరంభించాయి. ఆ ప్రయత్నాలలో కృష్ణాజిల్లాలో గల పరిటాల గ్రామం రిపబ్లిక్‌ను ప్రకటించుకుంది.ఆ గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ మౌలా సాహెబ్‌ దూర్‌హటో దునియా వాలో...హిందూస్ధాన్‌ హమారా హై, అంటూ జాతీయ పతాకాన్ని పరిటా కచ్చేరి మీద ఎగురవేసి సంచలనం సృష్టించారు. ఈ చర్యకు మూడు సంవత్సరాల కఠిన శిక్ష ఉన్నప్పటికీ మౌలా సాహెబ్‌ ఏమాత్రం భయపడకుండా పరిటాల పోరాటంలో చివరివరకు నిలిచారు. ఆనాటి పోరాటంలో పాల్గొన్న పలువురిలో వరంగల్‌కు చెందిన అబ్బాస్‌ అలీ హైదరాబాదులో నాలుగు మాసాలు జైలు శిక్షను అనుభవించారు. గన్నవరం నివాసి నాసిర్‌ మహమ్మద్‌ ఐదు మాసాలు, ఖమ్మం తాలూకా మధిరకు చెందిన ఖాదర్‌బేగ్‌ రెండు మాసాలు, ఖమ్మం జిల్లా ఎడ్లపల్లి రైతు ఇనగాని ఖాశిం రెండు మాసాలు, అదసర్లపాడు నివాసి షేక్‌ బాబు రెండు మాసాలు, జైలు శిక్షను అనుభవించారు. 1946లో నైజాం సేనలు ఖమ్మంకు చెందిన మహ్మద్‌ రజబ్‌ ఆలీని అరెస్టు చేసి మూడు మాసాల పాటు నిర్బంధంలో ఉంచాయి. స్వతంత్ర భారతంలో ఆయన పలుమార్లు శాసనసభ్యునిగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఆనాడు విలీనం కోరుతూ సాగిన ప్రజాపోరులో కొంత మంది ముస్లిం మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్య్ర సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆమె నఫీస్‌ ఆయేషా బేగం. హైదారాబాదు నివాసి. ఆమె తండ్రి పేరు హమీద్‌ అలీ ఖాన్‌. నైజాం సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని సాగిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు. నైజాం సంస్థానాధీశుని రాజకీయాలను, రజాకార్లు జరుపుతున్న చర్యలను వ్యతిరేకిస్తూ ప్రముఖ జర్నలిస్టు షోయాబుల్లాఖాన్‌ తాను సంపాదకత్వం వహిస్తున్న ఉర్దూ పత్రిక ఇమ్రోజ్‌లో వ్యాసాలు రాశారు.ఆ కారణంగా రజాకార్ల ఆగ్రహానిక గురైన ఆయనను 1948 ఆగస్టు 21 రాత్రి హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన సహచరుడు ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ ఈ సందర్భంగా చేతిని కొల్పోయారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మహమ్మద్‌ బాఖర్‌ ఆంగ్ల సైన్యాధికారుల చేతుల్లో చిత్రహింసలకు గురై కాల్చివేయబడ్డారు. స్వాతంత్య్రసమరంలో పాల్గొని పాలకులచే కాల్చివేతకు గురైన ప్రప్రథమ జర్నలిస్టుగా ఆయన ఖ్యాతి గడించారు. భారత స్వాతంత్య్ర పోరాటం చివరి థలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరాటం సాగిస్తూ, హత్యకు గురైన అక్షర యోధునిగా, ఇమ్రోజ్‌ సంపాదకుడు షోయాబుల్లా ఖాన్‌ చిరస్మరణీయమైన ఖ్యాతి పొందారు. ఆ తరువాత స్వాతంత్య్రోద్యమం స్ఫూర్తితో సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా ముస్లిం ప్రజానీకం తమ హిందూ సోదరులతో కలసి సాగారు. జనగామ తాలూకా దేవరుప్పల శివారు గ్రామం కామారెడ్డిగూడెంకు చెందిన షేక్‌ బందగి సాహెబ్‌ తన న్యాయమైన హక్కుల కోసం నిజాం సంస్థానంలోని విస్నూరు దేశ్‌ప్రముఖ్‌ రామచంద్రా రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి చరిత్ర సృష్టించారు. ఆ ఆవమానాన్ని భరించలేకపోయిన భూస్వామి రామచంద్రారెడ్డి 1940 జూలై 26న బందగీని హత్యచేయించాడు. దామచర్ల మండలానికి చెందిన షేక్‌ నన్నే బచ్చా లాంటి యోధులు తుపాకులు చేతబట్టి నిజాం రజాకార్లను, పోలీసులను సాయుధంగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పలు కష్టనష్టాలను ఎదుర్కొనటమే కాకుండా చిత్రహింసలను, భయానక జైలు జీవితాలను రుచిచూశారు. ఈ పోరాటంలో ముస్లిం స్త్రీలు కూడా ఏమాత్రం వెనుకంజవేయలేదు. నగరాలలో నివశించే రజియా బేగం, జమాలున్నీసా బేగం లాంటి వారితోపాటుగా తెలంగాణలోని రాజారం గ్రామానికి చెందిన జైనా బీ లాంటి మహిళలు కూడా ఏమాత్రం భయపడకుండా, ప్రాణత్యాగాలకు సిద్దపడి పోరుబాటన నడిచి మహత్తర చరిత్రకు కారణమయ్యారు. 1948 జూన్‌ 21న మౌంట్‌బాటన్‌ పదవీ విరమణ చేసి ఇంగ్లాండు వెళ్లిపోయాడు. మౌంట్‌బాటన్‌ నిష్క్రమణతో నైజాం పాలకుడు బలహీనుడయ్యాడు. జాతీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితులు నిజాంకు అనుకూలించలేదు. ఈ ప్రతికూల పరిస్ధితులలో ఉక్రోషం పట్టలేక రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల దుండగుల దండు మరింతగా విజృంభించగా 1948 సెప్టెంబర్‌ 13న తెల్లవారు ఝామున నైజాం సంస్ధానం పై భారత సైన్యం ముప్పేట దాడి ఆరంభించింది. ఈ చర్యలో పాల్గొన్నది భారత సైన్యం అయినప్పటికి అది 'పోలీసు చర్య' అని ఆనాటి గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి వర్ణించడంతో అదికాస్తా 'పోలీసు చర్య' స్థిరపడింది. ఈ పోలీసు చర్యలో హిందూ-ముస్లిం తేడా లేకుండా ప్రజలంతా బాధలకు గురయ్యారు. ప్రధానంగా అమాయక ముస్లింలు చాలా ఇక్కట్లు పడ్డారని భారీ సంఖ్యలో ప్రాణాలు కొల్పోయారని అధికారికంగా నిర్ధారించబడని అలనాటి పండిత సుందర్‌ లాల్‌ కమిటి నివేదికొకటి వెల్లడిస్తోంది. ఈ కమిటీలో ఉర్దూ పత్రిక పయాం సంపాదకులు ఖాజి ముహమ్మద్‌ అబ్దుల్‌ గఫార్‌, హైదరాబాదుకు చెందిన ప్రముఖ న్యాయవాది యూనిస్‌ సలీంలు సభ్యులయ్యారు. ఈ నివేదిక వలన పోలీసు చర్య పేరిట అమాకులను మీద సాగిన దుష్క్రృత్యాలన్నీ బయటకు వెల్లడి కావడం ఇష్టంలేని సర్దార్‌ పటేల్‌ నివేదికను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించాడు. ఆ కారణంగా ఆ నివేదికలోని నిజాలు సూచనప్రాయంగా వెల్లడి అయ్యేంత వరకు చరిత్రలో మరుగునపడిపోయాయి. ఆ తరువాత ఆ నివేదిక కాపీని కలిగి ఉన్న కమ్యూనిస్టు నాయకుడు శ్రీనివాస్‌ లాహోటి దానిని నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా (న్యూఢిల్లీ)లో దాఖలు చేసినట్టు 1988లో ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ఆ విధంగా ఆయన తన ఇంటర్వూలో పండిత సుందర్‌లాల్‌ కమిటీ నివేదిక గురించి వివరంగా ప్రస్తావించడంతో ఆనాటి నివేదిక లోని అంశాల గురించి అధ్యయనం ఆరంభమైంది. ఉర్దూలో ఉన్న ఆ నివేదికలోని కొన్ని భాగాలను పరిశీలించిన హైదరాబాదుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్‌ ఒమర్‌ ఖలిద్‌ తాను రాసి, వెలువరించిన హైదరాబాద్‌ ఆఫ్టర్‌ ఫాల్‌ అను గ్రంథంలో పోలీసు చర్య నాటి అకృత్యాలను, అఘాయిత్యాలను కొంత మేరకు ఉటంకించారు. (ముల్కి (కొలుపుల దస్తర్‌) ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక, సంపాదకులు వేముల ఎల్లయ్య, స్కై బాబ, డిసెంబరు 2003-మే 2004, హైదరాబాద్‌). ఆ సమాచారం ప్రకారం చూస్తే ఆనాడు సర్దార్‌ వల్లభాయి పటేల్‌ అన్నట్టుగా సబ్‌ ఠీఖ్‌ హువా అన్నది ఎంత మాత్రం నిజం కాదని, పోలీసు చర్య వలన అన్నివర్గాల ప్రజలు ప్రధానంగా ముస్లింలు అష్టకష్టాలు పడడం, పెద్ద సంఖ్యలో అటు సైన్యం ఇటు పోలీసుల బారినపడి ఆస్తిపాస్తులతోపాటు ప్రాణాలు కూడా కోల్పోవడం పచ్చి వాస్తవమని తెలుస్తుంది. చిట్టచివరకు 1948 సెప్టెంబరు17న నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ లో విలీనం చేయడానికి ఏడవ నిజాం నవాబు విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అంగీకరించాడు. హైదరాబాద్‌ సంస్థానంలోని ఆసఫియా పతాకాన్ని అవనతం చేశారు. పదిహేడు సాయంత్రం 7 గంటలకు దక్కన్‌ రెడియో ద్వారా విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ఇండియన్‌ యూనియన్‌లో నైజాం సంస్థానం విలీనం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆనాడు విూర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ చేసిన రేడియో ప్రసంగంలో నా ప్రియమైన ప్రజలారా, ... నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. అని ప్రకటించాడు. ఆ రోజున రజాకార్ల సంస్థను రద్దు చేస్తూ నిజాం సంస్థానాధీశుడు ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ విలీనం వలన మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్ర, నైజాం సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణలు కలసిపోయాయి. మద్రాసు రాష్ట్రం నుండి వేరుచేసి తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎన్నటి నుండో కోరుతూ వచ్చిన తెలుగు ప్రజల ఆకాంక్షకు తగినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం ఏర్పడలేదు. మద్రాసు రాష్ట్రంలో భాగంగానే తెలుగు ప్రజలు కొనసాగాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితి నుండి బయట పడడానికి ప్రజలు మరో ప్రజాపోరు సాగించాల్సి వచ్చింది. ఈ ప్రజాస్వామిక శాంతియుత పోరాటానికి నాయకుడు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు.ఆనాటి ప్రధాని పండిత జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రజా ఉద్యమం పట్ల ఏమాత్రం స్పందించక పోవడంతో ప్రజానీకం తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యింది. ఆమరణ నిరాహారదీక్ష వలన పొట్టి శ్రీరాములు పరిస్ధితి పూర్తిగా ప్రమాదం అంచుకు చేరుకుంది. చివరకు ఆయన ఆమరణ దీక్షను కొనసాగిస్తూనే 53వ రోజున కన్నుమూశారు. చివరకు అమరజీవి దృఢ నిర్ణయం, తెలుగు ప్రజల ఆందోళన ముందు భారత పాలకులు తలవొగ్గి దిగిరాక తప్పలేదు.1956 నవంబరు ఒకటిన ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుండి విడివడి తెలుగు ప్రజల స్వంత రాష్ట్రంగా రాయలసీమ, సర్కారు, కోస్తా ఆంధ్ర, తెంగాణా ప్రాంతాల కలయికతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశ చిత్రపటం విూద నూతన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.
 
==పాదపీఠికలు==