గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
గయ నియోజకవర్గానికి శ్రీ ఈశ్వర్ చౌదరి ఐదవ, ఆరవ మరియు తొమ్మిదవ 1971-79 నుండి 1989 -1991 వరకు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. ఆయన ప్రఖ్యాత సంఘసేవకుడు ఆయన తనజీవితాన్ని బలహీనవర్గాలను ముందుకు తీసుకురావడానికి అంకితం చేసాడు. ఆయన పార్లమెంటులో క్రియాశీలకంగా పనిచేసాడు. ఆయన షేడ్యూల్ కులాలు మరియు గిరిజనుల సంక్షేమానికి కృషిచేసాడు. ఆయన సేవలు శ్రామిక సంక్షేమ మంత్రిత్వశాఖ సలహా కమిటీలో కూడా కొనసాగాయి. 1991 మే మాసంలో ఆయన తన 52వ సంవత్సరంలో పదవ పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేసిన సమయంలో తుపాకితో కాల్చివేయబడ్డాడు.
== పేరువెనుక చరిత్ర ==
పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు వుండేవాడు. అతనికే గయాసురుడు అని వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాల పొడవు, వెడల్పులుగా పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటలేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతూవున్నా ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు.
 
‘గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను’ అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు. అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందారూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞ వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు -
=== గయలో పవిత్ర క్షేత్రాలు ===
 
“మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచండి" అని ఆదేఇంచాడు. దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై వుంచినా తల కడులూతునే వుంది. ఫలితంగా బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని వుండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాదధూళిసోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన సిల బరువుకు ఎలా అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవ్వరు ఇకమీదట నన్ను చూడలేరు. అయినా ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా వుంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు.
=== గయలో పవిత్ర క్షేత్రాలు ===
[[దస్త్రం:Mahabodhitemple.jpg|left|thumb|200px|[[Mahabodhi Temple]], [[Bodh Gaya]]. The site where [[Gautam Buddha]] attained [[Bodhi|enlightenment]].]]
బౌద్ధ మరియు హిందూ మతాలకు గయ ఒక పవిత్రనగరం. పవిత్ర ఫలగూ నదీతీతంలో స్నానఘట్టాలు మరియు ఆలయాలు బారులుతీరి ఉంటాయి. రావిచెట్లు, అక్షయవట్, మర్రిచెట్టు మొదలైన పవిత్ర వృక్షాలుకూడా ఉన్నాయి. పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది. ప్రస్తుతం ఫలగూ నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. గయాసురుని చాతి మీద భగవానుడైన మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే. విష్ణుపద్ ఆలయంలో భూమిహార్ బ్రాహ్మణులు వంశపారంపర్యంగా పూజలు చేస్తుంటారు. పక్కన జిల్లా అయిన హజారీభాగ్ నుండి వచ్చే గయావాల్ పాండాలు ఇక్కడ పూజాదికాలకు యాత్రీకులకు సహకరిస్తుంటారు. 18వ శతాబ్దిలో దేవి అహల్యాభాయ్ హోల్‌కర్ ప్రస్తుత ఆలయం నిర్మించింది. విష్ణుపద్ ఆలయంలోని పాదముద్రలను బౌద్ధసంప్రదాయం కూడా గౌరవిస్తుంది. భగవాన్ విష్ణుమూర్తి దశావతారాలలో బుద్ధుడు ఒకడని విశ్వసించబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు