రైలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==చరిత్ర==
===రైలు మార్గాలు===
[[File:Rail tracks view at Laxmipur Road.jpg|thumb|250px|భారత దేశంలో ఒక రైలు మార్గం]]
[[File:Risanatrice.jpg|thumb|left|250px|ఇటలీ దేశంలో ఒక రైలు మార్గం]]
[[File:Maintenance of way.jpg|thumb|250px|అమెరికాలో దేశంలో ఒక రైలు మార్గం]]
[[File:(SC-Kazipet) Trunk Route near Moula-Ali.JPG|thumb|left|250px|భారత దేశంలో విద్యుతీకరించబడిన ఒక రైలు మార్గం]]
నునుపైన రాళ్ళను గానీ, కొత్త దూలాలను గానీ సమాంతర పట్టాల లాగ పరిచినపుడు లేదా రోడ్డు తలాన్ని గట్టి పరచినపుడు స్లెడ్జిలూ, బండ్లూ వాటిపై సులభంగా చలించగలవని మానవుడు చాలాకాలం క్రితమే కనుగొన్నాడు. ప్రాచీన [[గ్రీసు]] దేశంలో 5,6 అంగుళాల లోతు, 2,3 అంగుళాల వెడల్పు గల గాడీలను 3-5 అడుగుల ఎడం ఉండేటట్లు ఏర్పరచి, మత సంబంధమైన ఉత్సవాల్లో అలంకరించిన బండ్లను ఊరేగించారు. కోరింత్ భూసంధి వద్ద ఓడలను ఒకవైపు నుంచి మరో వైపుకు తీసుకెళ్ళాలంటే మటపాన్ అగ్రం చుట్టూ పెద్ద ప్రయాణం చేయాల్సి వచ్చేది. గ్రీకులు ఓడలను సులభంగా తరలించటానికి కోరింత్ భూసంధి గుండా కొయ్య పట్టాలతో ఒక మార్గం నిర్మించారు. మామూలు రోడ్డు కంటె పట్టాల వెంబడి అయితే ఎనిమిది రెట్ల బరువులను మనిషి గానీ, గుర్రంగానీ లాగగలదని గ్రీకులు కనుగొన్నారు. రోమన్ లు కూడ సైనిక ప్రయోజనాల కోసం గాడీ పట్టాలను ఉపయోగించేవారు.
పురాతన కాలానికి సంబంధించిన అనేక సాంకేతిక విజయాల లాగే మధ్య యుగాల్లో రైలు మార్గం తెరమరుగున పడిపోయింది. ఇది మళ్ళీ ఆవిర్భవించటం 15,16 శతాబ్దాల్లోనే. గనుల్లోనుంచి బొగ్గునూ, ఖనిజాన్ని తరలించటానికి జర్మన్ లు తొలిసారిగా రైలు మార్గాలను నిర్మించారు. చిన్న బండ్లను తోయటానికి కార్మికులను గానీ గుర్రాలను గానీ ఉపయోగించేవారు. 16 వ శతాబ్దం చివర భాగంలో [[ఇంగ్లండ్]] గనులను ఆధునీకరణం చేయటానికి [[జర్మనీ|జర్మన్లు]] ఆహ్వానించబడ్డారు.వాళ్ళతో బాటే ట్రాం మార్గం కూడా [[ఇంగ్లండ్]] లో ప్రవేశించింది.
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు