ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎బోధనా వృత్తి: లాస్యప్రియ
పంక్తి 51:
ఈ నేపథ్యంతో [[హైదరాబాదు]]కి చెందిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత/నాట్య కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా 1969 నుండి 1988 వరకు భరతనాట్యంలో విద్యార్థులకు సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను బోధించినది. తర్వాత పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో నృత్య విభాగానికి అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
 
నృత్యకళలో విద్యార్థుల పరిశోధన మరియు ఇతర కార్యకలాపాలలో పర్యవేక్షణకై 'షాహజీ రాజు యక్షగాన ప్రబంధాలు' (షాహజీ 1684 నుండి 1712 వరకూ [[తంజావూరు]]ని ఏలినపరిపాలించిన ఒక మరాఠీ రాజు. ఈయన తెలుగు భాషలో ఇరవై యక్షగానాలని కూర్చారు.) అనే థీసిస్ ని తెలుగు విశ్వవిద్యాలయానికి సమర్పించి 1994 లో పీహెచ్ డీ పట్టాతో బాటు బంగారు పతకాన్ని కూడా అందుకొన్నారు.
 
తెలుగు విశ్వవిద్యాలయానికి నృత్య విభాగానికి అధిపతి అయిన డా. అలేఖ్య పుంజాల, జ్యోతి లక్కరాజు, మాధురి కిషోర్, పద్మ చేబ్రోలు మరియు పల్లవి కుమార్ లు వీరి ప్రియ శిష్యురాళ్ళే.
===లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీ===
1985 లో లాస్యప్రియా డ్యాన్స్ అకాడమీని [[హైదరాబాదులో]] స్థాపించారు. ఈ కళాశాల [[కూచిపూడి]] మరియు [[భరతనాట్యం]] లలో ని నృత్య సాంప్రదాయలని సైద్ధాంతిక మరియు ఆచరణీయ అంశాలపై శిక్షణనిస్తూ విద్యార్థులని రాష్ట్ర ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షలకి సిద్ధం చేస్తుంది. లాస్యప్రియ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కి అనుబంధ సంస్థ.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు