విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

శ్రీ విద్యారణ్య స్వామి వ్యాసం లోని విషయాన్ని ఇందులో చేర్చితిని.
పంక్తి 2:
{{విలీనం|శ్రీ విద్యారణ్య స్వామి}}
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు ]]
 
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది శంకరాచార్యులు|శంకరాచార్యుల]] తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.
 
==సన్యాసం స్వీకరణ==
సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ. ఈ మాధవ ఇప్పటి [[వరంగల్లు]](ఏలశిలా నగరం)లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ సోదర బ్రహ్మచారులలో పెద్దవాడు. వీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కోసం దేశాటన జరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన [[విద్యాశంకర తీర్థ]]స్వామి ఆ బాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెంది, వానిలో ఉన్న ప్రతిభను గుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆయన పేరుని [[భారతీకృష్ణ తీర్థ]] స్వామి గా మారుస్తారు. ఇది ఇలా ఉండగా తన తమ్ముని వెదుక్కుంటూ మాధవ శృంగేరి చేరుతాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్థగా మారడం తెలుసుకొంటాడు, తానూ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని తమ్ముడైన భారతీతీర్థ తన గురువైన అప్పటి పీఠాధిపతి అయిన విద్యాశంకరస్వామిని ఒప్పించి మాధవకు సన్యాసం ఇప్పిస్తాడు. విద్యాశంకర స్వామి మాధవకు క్రీ.శ. 1331 సంవత్సరంలో సన్యాసం ఇచ్చి విద్యారణ్య అని నామకరణం చేస్తారు. విద్యారణ్య అంటే అరణ్యం వంటి జ్ఞానం కలవాడు అని అర్థం.
 
వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా,ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.
 
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు [[కాశీ]] మరియు [[బదరీ]] కి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా కాలం గడుపుతున్న సమయములో ఒక రోజు భారద్వాజస [[గోత్రం|గోత్రీకుడైన]] మయన కుమారులు మాధవ ,సాయన లు విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు తాను అసంపూర్తిగా రచించి వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని వారితో చెబుతాడు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమనికూడా చెబుతాడు.ఆవిధంగా అవి సాయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో వీరు [[మొదటి హరిహర రాయలు|హరిహరరాయలు]] , [[మొదటి బుక్క రాయలు|బుక్క రాయలు]] ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.విద్యారణ్య తిరిగి కాశీ యాత్ర వెళ్ళారు
 
==విజయనగర సామ్రాజ్య స్థాపన==
Line 16 ⟶ 17:
 
==జగద్గురువుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశీ వెళ్ళాడు. అదే సమయంలో విద్యాతీర్థస్వామి లంభిక యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తన గురువైన విద్యాతీర్థ స్వామి సమాధిపై బ్రహ్మాండమైన విద్యాశంకర దేవాలయం నిర్మాణంను భారతీకృష్ణతీర్థ స్వామి ప్రారంభించాడు. బుక్కరాయలు, హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు.హరిహర బుక్కరాయలు విజయ పరంపరలో 1345 సంవత్సరం శృంగేరి చేరి భారతీకృష్ణుల ఆశీర్వచనాలు పొందారు. 1346 సంవత్సరములో శృంగేరికి వెళ్లి, భారతీకృష్ణతీర్థ స్వామి దర్శనం చేసుకొని కొంత భూమిని శ్రీపాదులకు దానంగా ఇచ్చారు.
 
విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరికి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.
 
==విద్యారణ్యుడి గురించి==
[[భారతీకృష్ణ తీర్థ]] శృంగేరి మఠాన్ని అధిరోహించి క్రీ.శ. 1333 నుండి 1380 వరకు పరిపాలించారు. భారతీకృష్ణ తీర్థ స్వామి గురువుగారు సమాధిచెందిన ప్రదేశంలో శ్రీ విద్యాశంకర దేవాలయం నిర్మించడం మొదలుపెట్టారు. శృంగేరీ శారదామఠానికి పీఠాధిపతిగా 6 సంవత్సరాలు 1380-1386 వరకు ఉండి 1386 లో విదేహ ముక్తి పొందుతాడు. హరిహర రాయలు విద్యారణ్యుడి విదేహ ముక్తి విషయాన్ని తెలుసుకొని విద్యారణ్యపురం అనే పేరుతో ఒక అగ్రహారాన్ని శృంగేరి మఠానికి దానం ఇస్తాడు.
విద్యారణ్యుడు గొప్ప విద్వాంసుడు, గొప్ప యోగి, శంకరుల కాలము తరువాత శంకరులంతటి వానిగా వర్ణించబడ్డాడు.
 
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు