పులి వేషం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
==డప్పుల హంగు==
 
పెద్ద పులి ప్రవేశానికి హంగుగా రెండు డప్పులు గంభీర ధ్వనులు చేస్తూ వుంటే, ఆ ధ్వనులతో ఉత్తేజం పొందిన పులి వేష ధారి, హుందా అయిన పులి నడకలతో గంభీరపు చూపులతో వాయిద్యానికి తగినట్లు నృత్యం చేస్తూ చికు చిక్కు చిక్కు చికు చిక్కు అంటూ ఎగిరి పల్టీలు కొడుతూ ఉధృత వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పిల్ల జంతువులను వేటాడినట్లు ఆకలి గొన్న పులి లాగా వివిధ చేష్టలు చేస్తూ, పొంచి వుండి ఆమాంతం ఏమేకఏ మేక పిల్లనో నోటితో కరచి పట్టి నట్లు నటిస్తారు. ఒక్కొక్క సారి ఇరువురు పులి వేషాలను ధరించి ఎదురు బొదురుగా నిలబడి రెండు పులులూ పోట్లాడు కుంటున్నట్లు వాయిద్యాల ధ్వనులతో భయంకరంగా పోట్లాడుతూ ఎగిరి గంతులు వేస్తూ, తొడగొట్టి అరుపులతో, కేకలతో నానా హంగామా చేస్తారు. ఈ నృత్యంలో పెద్దపులి - వేటగాడు అనె రెండు పాత్రలు ప్రవేశిస్తాయి. వేట గాడు పులిని చంపాలనే, ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ వాయిద్య గతుల్లో అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ బరిసెతో పులిని చంపడానికి ఎగిరి గంతేస్తాడు. తప్పించు కోవడానికి పులి వేష ధారి ఎగిరి పల్టీలు కొడుతాడు. ఇలా రెండు పాత్రలూ ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూ చివరికి పులిని వధించి నట్లు కొందరు చూపుతారు. చని పోయేముందు పులి, వేటగాని మీదకు లంఘించి అతని గాయ పరిచినట్లు చూపుతారు.
 
==అడవిలో పులి:==
"https://te.wikipedia.org/wiki/పులి_వేషం" నుండి వెలికితీశారు