లాల్‌జాన్ బాషా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1956 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 40:
==మరణం==
[[ఆగస్టు 15]], [[2013]] , గురువారం నాడు [[హైదరాబాద్]] నుండి [[విజయవాడ]] వెళుతుండగా, [[నల్గొండ జిల్లా]], [[నార్కెట్‌పల్లి]] సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
== బాషా రాజకీయ ప్రస్థానం==
లాల్‌జాన్‌బాషా 1956 లో గుంటూరులో జన్మించారు. ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగి.. ఆచార్య ఎన్‌జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 1998లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమి పాలయ్యారు. 1999లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీపడ్డారు. కానీ విజయం సాధించలేకపోయారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.<ref>[http://www.sakshi.com/news/top-news/tdp-leader-lal-jan-basha-dies-in-road-accident-57452 లాల్ జాన్ బాషా గూర్చి సాక్షి లో ]</ref>
==సంతాపం==
బాషా మృతి చెందిన వార్త తెలియగానే [[నకిరేకల్]] ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, టీడీపీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు.అయితే లాల్ జాన్ బాషా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు బాషా మృతికి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాషా మృతితో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఓ మంచి నేతను కొల్పోయిందని [[నరసరావుపేట]] ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తన సంతపం ప్రకటనలో తెలిపారు.
"https://te.wikipedia.org/wiki/లాల్‌జాన్_బాషా" నుండి వెలికితీశారు