గుల్జార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
చలనచిత్ర పాటల ప్రముఖ రచయిత '''గుల్జార్''' [[1936]], [[ఆగష్టు 18]]న ప్రస్తుత [[పాకిస్తాన్]] భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. దేశవిభజన తరువాత అతని కుంటుంబం [[ఢిల్లీ]]కి వలస వచ్చింది. గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. [[హిందీ]], [[ఉర్దూ]] మరియు [[పంజాబీ]] భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు.
==సినీ గేయ రచయితగా==
బిమల్‌రాయ్ వద్ద సహాయ దర్శకుడిగా గుల్జార్ సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. బిమల్‌రాయ్ ప్రాత్సాహంతోనే గేయ రచనకు కలంపట్టి అతని దర్శకత్వంలో బందిని చిత్రానికి తొలి పాతపాట రాశాడు.
[[మీనా కుమారి (హిందీ నటి)|మీనా కుమారి]] మరణించిన తరువాత ఆమె రాసినవ్రాసిన షాయరీలను, గీతాలను తనే అచ్చువేశాడుఅచ్చు వేశాడు. వీటిని తను మరణించిన తరువాత అచ్చువేయాలని ఆమె తనకు సన్నిహితుడైన గుల్జార్‌ను కోరింది. ప్రముఖ మరాఠీ రచయిత [[అమృతా ప్రీతమ్]] రచనలకు కూడా గుల్జార్ అనువాదం చేశాడు. ఉర్దూ షాయరీలో అందరూ తప్పనిసరిగా రాసే రెండు వాక్యాల నజ్మ్ శైలిని ఆయన కవితా సంకలనం త్రివేణిలో మూడు లైన్లను కలిపి ఒక నజ్మ్ రాసే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆయన [[ఉర్దూ]] కథా సంకలనం ధువాఁ (పొగ) కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఉదారవాద కవి అయిన గుల్జార్ లైకిన్, ఆంధీ, పరిచయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
==గుర్తింపులు, అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/గుల్జార్" నుండి వెలికితీశారు