మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 54:
టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరువాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. ఈ రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం మరియు బరువు తగ్గించడం ద్వారా నియంత్రిస్తారు. వీటివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తరువాత యాంటీ డయాబెటిక్ మందుల ద్వారా నియంత్రిస్తారు.<ref>{{cite journal |author= |title=Effect of intensive blood-glucose control with metformin on complications in overweight patients with type&nbsp;2 diabetes (UKPDS 34). UK Prospective Diabetes Study (UKPDS) Group |journal=Lancet |volume=352 |issue=9131 |pages=854–65 |year=1998 |pmid=9742977|doi=10.1016/S0140-6736(98)07037-8}}</ref> ఈ చికిత్స కూడా పనిచేయకపోతే ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది.
 
==కారణాలు==
వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ పూర్తిగా లోపించడం,గంటల తరబడి కూర్చోని ఉండటం, పోషకపదార్థాలు సరిగా లేని ఆహారం, వేపుడు కూరలు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు, మాంసాహారం, బేకరీ పదార్థాలు, నిల్వఉండే పచ్చళ్లు , తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల దుష్ఫరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టెరాయిడ్స్, కొన్ని రకాల వైరస్, ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంటుంది.
మధుమేహం రకాలు
టైప్ 1 మధుమేహం: కొందరిలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. వీరికి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది.
టైప్ 2 మధుమేహం: వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాదు. పాంక్రియాస్, ఇన్ఫెక్షన్స్ వల్లగాని, ఆహార నియమాలు సరిగా లేకపోవడం చేత, క్రమంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది.
గెస్టెషనల్ డయాబెటిస్: గర్భవతుల్లో 2 నుంచి 5 శాతం వరకు ఈ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ డయాబెటిస్‌కు సరిగా వైద్యం అందించకపోతే తల్లీ,బిడ్డలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రసవం తర్వాత డయాబెటిస్ ఉండవచ్చు.
== జాగ్రత్తలు ==
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు