అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
* భూదేవియే [[గోదాదేవి]]గా అవతరించి శ్రీరంగనాధుని వరించింది. ఈమెను ఆండాళ్, ఆముక్త మాల్యద (తాల్చి ఇచ్చిన తల్లి), చూడి కొడుత నాచియార్ అని కూడా అంటారు. భూదేవి స్వరూపమే సత్యభామ అనికూడా పురాణ కధనం గమనించాలి.
 
[[దస్త్రం:Main gopuram of padmavati ammavaari temple tirucanuru.JPG|thumb|right|తిరుచానూరు, పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన గోపురము]]
[[దస్త్రం:Entrance to the deep well. tirucanuru.JPG|thumb|left|తిరుచానూరు, శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యాన వన ప్రాంగణంలో వున్న ఒక బావి ముఖ ద్వారము]]
* కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కధనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కధనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును.
Line 38 ⟶ 37:
అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది. తరువాత సహస్ర నామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ ఉంటాయి. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేస్తారు. ప్రతి సోమవారం "అష్టదళ పదపద్మారాధన" జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది. ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా స్వీకరిస్తారు.
[[దస్త్రం:Mandapam at tirucanuru (2).JPG|thumb|right|తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో వున్న ఒక మండపము]]
 
[[దస్త్రం:Padmavati ammavari garden. tirucanuru.JPG|thumb|left|తిరుచానూరు; శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవన ముఖ ద్వారము]]
"కార్తీక బ్రహ్మోత్సవాలు" ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన [[కార్తీక శుద్ధ పంచమి]] నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే [[చక్రత్తాళ్వార్]]‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. [[ఆది శంకరాచార్యులు]] అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. [[దసరా]]కు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా తెప్పోత్సవం, వసంతోత్సవం, రధ సప్తమి ముఖ్యమైన ఉత్సవాలు. సుందరరాజ స్వామి గుడిలో మూడు రోజుల పాటు అవతారోత్సవం జరుగుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు