బుద్ధిమంతుడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

బుధ్దిమంతుడు సినిమా వ్యాసంలోని విశేషాలను విలీనం చేసితిని.
పంక్తి 16:
imdb_id= 0155567
}}
దేవుడున్నాడా లేడా.. బడా.. గుడా..ఆస్తికత్వమా..నాస్తికత్వమా..దేవుడిని నమ్ముకున్న అమాయకుడైన అన్న, దేవుని మీద నమ్మకం లేని గడుసు తమ్ముడు, దేవుడిని అడ్డుపెడ్డకొని పబ్బం గడుపుకునే వాడు ..ఈ పాత్రలతో రూపొందిన చిత్రం.
 
'''బుద్ధిమంతుడు''' , 1969లో విడుదలైన [[తెలుగు సినిమా]]. తరాల అంతరాలు కారణంగా విభిన్న మనస్తత్వాలు కలిగిన అన్నదమ్ముల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యలను సున్నితంగా ఈ సినిమాలో చిత్రీకరించారు. అదే సమయంలో ఊరిలో జరిగే కుతంత్రాలు కూడా కధలో కలిసిపోతాయి. చాలా సినిమాలలో ఉండే సామాన్యమైన కధాంశమే ఇది. అయితే సాక్షాత్తు భగవంతుడు ఒక సామాన్యమైన వ్యక్తి వలే ఒకరికి కనుపిస్తూ మాట్లాడుతూ, అతను నివేదన చేసిన భోజనం స్వీకరిస్తూ, ఇతరులకు తెలియకుండా, చాలా సహజంగా మరొక పాత్రలాగా ఈ కధలో ఇమిడిపోవడం వలన ఈ సినిమా కధ స్వరూపమే మారిపోయింది.
Line 25 ⟶ 26:
 
తమ్ముని దుడుకు చేష్టలూ, వ్యసనాలూ మాధవయ్యకు ఆవేదన కలిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆ ఊరి కామందుల కుట్రలకు మాధవయ్య గురవుతాడు. వారి అసలైన దుష్టగుణాలను మాధవయ్య తెలిసికోలేడు. వారి పన్నాగాల వలన అన్నదమ్ములిద్దరూ వేరవుతారు.
== చిత్రకథ ==
 
మాధవచార్యలు శ్రీకృష్ణాలయ అర్చకుడు. ఆయనకు శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తు ఉంటాడు.భార్యమరణించింది .తల్లి. పదేళ్ల కుమారుడు.తమ్ముడు గోపలాచార్యులు. నాస్తికుడు. చెడు సావాసాలు. అన్నీ అలవాట్లు ఉన్నాయి. తమ్ముడు దారి తప్పి తిరుగుతున్నాడని అన్న గారి బాధ. తన వేదనని శ్రీకృష్ణుడికి నివేదించుకుంటాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకుంటాడు. ఆ గుడి ధర్మకర్త అన్న శేషాద్రి. చెల్లెలి గారి పొలాలను, గుడి మాన్యాన్ని సాగు చేసి దిగుబడి బాగున్నా, దిగుబడి లేదంటూ వాటి మీద వచ్చే ఆదాయాన్ని, బడి గ్రాంట్ ని దిగమింగుతూ ఉంటాడు. మాధవకు శేషాద్రి దేవ సమానుడు.శేషాద్రి పనులు గోపికి నచ్చవు. బడి పంతులుకు జీతం ఇవ్వలేదని,శేషాద్రి పంటతో వెళ్తున్న బండిని ఆపి, ధాన్యం బస్తాను దింపిస్తాడు. అన్న గారికి ఫిర్యాదు చేస్తాడు శేషాద్రి. గోపీకి ఫార్మసీ చదివించి ఉద్యోగం చూపిస్తానంటాడు. గోపీ అన్నగారితో తగువులాడి వేరు పడతాడు. గోపి, శేషాద్రి చెల్లెలు కూతురు రాధప్రేమించుకుంటారు. మేనకోడలిని తన కుమారుడుకిచ్చి పెళ్లిచేసి ఆ ఆస్తినంతా తన పరం చేసుకోవాలని శేషాద్రి కోరిక. శేషాద్రి కొడుకు బడిపంతులు కూతురుని లోబరచుకుంటాడు. ప్రేమలో పడ్డ తర్వాత గోపి వ్యసనాలకు దూరం గా ఉంటాడు కానీ శేషాద్రి ని ఎదిరిస్తూ ఉంటాడు. స్నేహితుల ప్రోద్బలం మీద తోటలో పార్టీకి వెళ్లి తాగి పడిపోతాడు గోపి. శేషాద్రి దాన్ని రాధకు చూపి ప్రేమికులను విడదీస్తాడు. అన్నకి, తమ్ముడికి మధ్య అంతరం పెరుగుతుంది. గుడికి, బడికి రిఫెండ్రం పెడతారు. ప్రచారం మొదలవుతుంది. గాలిగోపురం కలశాన్ని గాలిలో ఎగరేసి దేవుని మహిమ చూపమని మాధవని ఆదేశిస్తాడు. మాధవకి దైవదర్శనం కాదు. దైవం తన మాట వినకపోతే తల శిలకేసి కొట్టుకుంటానని మాధవ తలుపు వేసుకొని కూర్చొంటాడు. అన్న గారి పంతాన్ని విన్న గోపి ఆలయం ఎక్కి కలశాన్ని గాలిలో ఎగర వేస్తాడు. అందరూ జయజయధ్వానాలు చేస్తారు. మాధవుడు లోనుంచి వస్తాడు. దిగుతున్న తమ్ముడు కనబడతాడు. తమ్ముడి మీద కోపగించుకుంటాడు.తమ్ముడు అన్నతో నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని శేషాద్రి లాంటి దుర్మార్గులు ఆటలాడుతూ ఉంటే దేవుడు ఎందుకు మహిమ చూపాలి అని వాదులాడతాడు. శేషాద్రి దుర్మార్గం అందరికీ తెలుస్తుంది. గోపీ, రాధ లమధ్య అపార్దాలు తొలగి పోతాయి. శేషాద్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ముగుస్తుంది.
 
== చిత్ర విశేషాలు ==
 
ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయనం చేసారు. మాధవాచార్యులు,గోపాలాచార్యుల పాత్రలను ఆయన పోషించారు. సాక్షి, బంగారుపిచ్చుక చిత్రాలను చూసి చిత్రీకరణ విధానాన్ని మెచ్చుకొని నాగేశ్వరరావు గారే బాపు ముళ్లపూడి కి కాల్షీట్లు ఇచ్చేరని చెప్పుకుంటారు.
== సంభాషణా చాతుర్యం ==
ముళ్లపూడి వారి చతురత, హస్యప్రియత్వం ఈ చిత్రంలో అడుగడుగునా కనబడుతుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, మాధవకి మధ్య సంభాషణ రమ్యాతిరమ్యం. శ్రీకృష్ణుడితో మాధవ నవ్వుసలు లేవని అంటాడు అని తమ్ముడిమీద ఫిర్యాదు చేస్తాడు. అతడన్నట్టు నేను లేనేమో అంటాడు శ్రీకృష్ణుడు. కంటి ఎదురుగా నీవు కనబడుతున్నావని మాధవ అంటే అదికూడా నీభ్రమేనేనోమో అంటాడు శ్రీకృష్ణుడు. ఇధమిధ్ధంగా అస్థిత్వాన్ని, నాస్తికత్వాన్ని సమర్ధించకుండా మానవత్వమే గొప్ప వాదమని అంతర్లీనంగా చెప్పుతుంది ఈ చిత్రం.
==పాటలు==
అన్ని పాటలకు [[కె.వి.మహదేవన్]] సంగీతం సమకూర్చారు.