తెలుగు నాటకాలు - జాతీయోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
తెలుగు నాటకాలలో కనిపిస్తున్న జాతీయోద్యమ ప్రభావాన్ని వివరిస్తూ డా. [[రావి రవి ప్రకాశ్‌]] రాసిన పరిశోధనాత్మక గ్రంథం - '''తెలుగు నాటకాలు – జాతీయోద్యమం'''. 2005వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పట్టా పొందిన సిద్ధాంత వ్యాసాన్ని ఇటీవల పుస్తకంగా ప్రచురించారు.
 
భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటనల్ని నాటక రచయితలు వివిధ నాటకాలుగా మలిచి ప్రజల్ని చైతన్య పరిచిన విధానాన్ని రచయిత దీనిలో చక్కగా నిరూపించారు. ప్రజలు తాము నివశిస్తున్న నేల మీద అభిమానాన్ని ప్రకటించడం, స్వజాతి జనుల మీద ప్రేమను పెంపొందించుకోవటం జాతీయతలో కనిపించే కొన్ని ముఖ్యాంశాలు. తరతరాలుగా కొనసాగుతున్న స్థానిక సత్సంప్రదాయాలపై ప్రగాఢమైన అభిమానం; నిర్దిష్ట పాలనా వ్యవస్థకి అనుగుణంగా మనుగడ సాధించే మానసిక స్థితిని కలిగి ఉండటం జాతీయత అనవచ్చు.