తుంగల చలపతిరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
1935లో చలపతిరావు, [[దాసరి కోటిరత్నం]], [[బి.వి.రామానందం]]లతో కలిసి ' భారత లక్ష్మి ఫిలిమ్స్ ' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి [[కలకత్తా]]లో [[సతీ సక్కుబాయి]] అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో కోటిరత్నం సక్కుబాయిగా, చలపతిరావు కృష్ణునిగా నటించారు.<ref>[http://sirakadambam.blogspot.com/2009/11/blog-post_1570.html శిరా కదంబం: మొదటి మహిళా చిత్ర నిర్మాత]</ref> తెలుగు చలనచిత్రాలలో మొట్టమొదటి కృష్ణుని వేసిన తొలినటుల్లో చలపతిరావు ఒకడు. నాటకాల్లో దాసరి కోటిరత్నం పురుషపాత్రలు వేస్తే ఆమెకు జంటగా తుంగల చలపతిరావు స్త్రీ పాత్రలు వేసేవారట. ఈయన రంగస్థలంపై మంచి గాయకుడుగా కూడా పేరుతెచ్చుకున్నాడు.
 
దివిసీమలోని శ్రీకాకుళంలో జన్మించిన తుంగల చలపతిరావు దైతాగోపాలం దర్శకత్వంలో 'సక్కుబాయి' పాత్రలో శిక్షణ పొంది ఆ ఒక్క పాత్రలోనే అసామాన్య ఖ్యాతి గడించారు. 1935లో బి.వి.రామానందం 'సతీ సక్కుబాయి'ని సినిమాగా తీయాలని ఆ నాటక సమాజాన్నంతా కలకత్తా తీసికొని వెళ్ళారు. ఆ చలన చిత్రంలో తుంగల చలపతిరావు కృష్ణుడుగాను, నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే డి. కోటిరత్నం సక్కుబాయిగాను నటించారు. 1938లో సి. పుల్లయ్య తీసిన 'మోహినీ భస్మాసుర' చలన చిత్రంలో నారదుడుగా నటించారు. అలా చలనచిత్రాలలో నటిస్తూ మరోప్రక్క సక్కుబాయి నాటకాన్ని ఏ.వి.సుబ్బారావు, రేలంగి, కె. శివరావు, దాసరి కోటిరత్నం ప్రభృతులతో కలిసి ప్రదర్శించేవారు. వరవిక్రయం, పాండురంగ విఠల్‌ చిత్రాలలో పనిచేశారు. ఆయన 35 సంవత్సరాలైనా నిండకుండానే గుంటూరుజిల్లా మంగళగిరిలో నటిస్తూ సక్కుబాయి పాత్రలో భక్తి తన్మయంతో పాండురంగనిలో ఐక్యమయ్యే సన్నివేశంలో ఆయన కూడా ఐక్యమైపోయారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-147601 దివి సీమ దివ్వెలు - ఆంధ్రప్రభ సెప్టెంబరు 23, 2010]</ref>
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/తుంగల_చలపతిరావు" నుండి వెలికితీశారు