దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆయుర్వేద వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
ప్లేగు, కలరా వ్యాధుల నిరోధానికి ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించుకొని "శతధౌత ఘృతం" "హైమాది పంక్రమ్‌ (పానకం)" అనే రసాయనాలను సృష్టించి ఔషధ రూపంలో వ్యాధిగ్రస్తులకు అందించారు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు ఒకకూర్చారు.
 
తర్వాత కొద్దికాలానికి చెన్నపట్టణం చేరి, శ్రీకన్యకా పరమేశ్వరి ఆయుర్వేద కాలేజి అండ్ హాస్పిటల్ లో ప్రొఫెసర్ గా,వైద్యులుగా పనిచేశారు. ఇంగ్లీషు రాకున్నా ఎనిమిది భారతీయ భాషలు మీద సాధికారత సంపాదించుకున్నారు. వైద్యులుగా పనిచేస్తున్న సమయంలోనే గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకొని, మద్రాసులోనే ఆయుర్వేదాశ్రమమును నెలకొల్పారు. మరణించేవరకు అక్కడే ఉన్నారు. మద్రాసు ఆయుర్వేద కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
 
దేశీయ ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం తీసుకు రావాలనే మహదాశయంతో "ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల" ను ఏర్పాటు చేసి వివిధ భారతీయ భాషలలోని ప్రాచీన గ్రంధాలను సేకరించి, ఎంతో అరుదైన వాటిని అనువదింపజేశారు. ఈ గ్రంథమాల నుంచి దాదాపు 22 అతి ముఖ్యమైన వైద్య శాస్త్ర గ్రంథాలు వెలువడినాయి. వీటిలో మాధవ నిదానం, అర్క ప్రణాళిక, ఆయుర్వేద వైద్య పరిభాష, రస ప్రదీపిక, భేషకల్పం మొదలైన శీర్షికలతో ప్రాచీన హిందు వైద్య గ్రంథాలకు తెలుగులో చక్కని వ్యాఖ్యానాలు జోడించి, వివరించారు.
 
ఆయుర్వేద వైద్య చికిత్సకు దేశ