ఉబ్బసము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.<ref name=Lilly>{{cite journal |author=Lilly CM |title=Diversity of asthma: evolving concepts of pathophysiology and lessons from genetics |journal=J. Allergy Clin. Immunol. |volume=115 |issue=4 Suppl |pages=S526–31 |year=2005 |pmid=15806035 |doi=10.1016/j.jaci.2005.01.028}}</ref> అందువలన పట్టణాలలోని [[వాతావరణ కాలుష్యం]] నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉన్నది.
==కారణాలు==
 
శ్వాసకోశాలు, జీవితపు మనుగడకు అవసరమైన ప్రాణవాయువును శ్వాసప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజూ మన శ్వాసకోశాలు, పలురకాల వాతావరణ పరిస్థితులు, ఎలర్జైన్లు, రసాయనాలు, పొగ, దుమ్ము, దూళి తదితర అంశాలకు లోనవుతుంటాయి. వీటివల్ల వివిధ రకాల దీర్ఘవ్యాధులు వస్తాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి, శరీరానికి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జైన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందించి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వల్ల మన శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం రావడం, పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా ఉండడం, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడం, ముక్కునుంచి నీరు రావడం, తరుచూ జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యుసంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. లేదా అప్పటికే ఆస్తమా ఉంటే ఈ కారణాలతో మరికాస్తా పెరగవచ్చు.
==జాగ్రత్తలు==
*ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి.
*దుమ్మూదూళికి దూరంగా ఉండాలి.
*శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.
==ఆస్తమాను పెంచే కారణాలు==
చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు, , ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ, పుప్పొడి రేణువులు, ఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి.
==హోమియో చికిత్స==
ఏదైతే ఒక వ్యాధికి కారణమవుతుందో అదే ఆ వ్యాధికి చికిత్సకు ఉపయోగపడుతుంది అనే ప్రకృతి సిద్ధాంతం పై హోమియో వైద్య విధానం ఆధారపడి ఉంది. దీన్నే లాటిన్ భాషలో 'సిమిలియా సిమిలిబస్ క్యూరెంటార్ ' అంటారు. ఇది ఇంచుమించు 'ఉష్ణం ఉష్ణేన శీతలం' అన్న సూత్రం లాంటిదే. ప్రకృతిని నిశితంగా పరిశీలించడం, అనుకరించడం ద్వారా అన్ని విజ్ఞాన శాస్త్రాల్లోనూ ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు కనుగొన్నారు. హోమియోపతి కూడా అలాంటి విజ్ఞాన శాస్త్రమే. ఆస్తమానుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు హోమియోలో ఉన్నాయి. అయితే ఈ విధానం కేవలం ఆస్తమా లక్షణాలను తగ్గించడానికే పరిమితం కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారణాలను కూడా తొలగిస్తుంది. రోగి శరీర ధర్మాన్నే కాకుండా మానసిక తత్వాన్ని కూడా పూర్తిగా విశ్లేషించి హోమియో వైద్యులు మందులు సూచిస్తారు. అలాంటి మందుల్లో అకాలిఫా ఇండికా, ఎలియాంథస్ గాండ్యులోపా, అరాలియం రెసియోపా, బ్లాటా ఓరియంటాలిస్, బ్రోమియం, ఆర్సనికం ఆల్బం, ఆంటిమోనియం టార్టారికం, కాలికార్బ్, ఇపికాక్, పల్సటిల్లా వంటి మందులు ప్రముఖమైనవి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడవలసి ఉంటుంది.
== [[చేప మందు]] ==
ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు గత కొన్నేళ్ళుగా వేస్తున్న చేపమందుపై నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. వైద్య శాస్త్రంలో చేప మందువల్ల తగ్గిపోయే జబ్బు ఏదీ లేదని ఆయన అన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఉబ్బసము" నుండి వెలికితీశారు