అసిడిటీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{వ్యాఖ్య| "ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం ప...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వ్యాఖ్య| "ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.|}}
 
 
జీర్ణాశయంలోని జఠర గ్రంధులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు.
==ఎలా వస్తుంది?==
 
సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.
==లక్షణాలు==
 
ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/అసిడిటీ" నుండి వెలికితీశారు