శారదా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శారదా దేవి''' ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు [[రామకృష్ణ పరమహంస]] భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి. జననం 18.12.1853. మరణం 20.7.1920.
{{మొలక}}
[[రామకృష్ణ పరమహంస]] భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి. జననం 18.12.1853. మరణం 20.7.1920.
 
శారదాదేవి
 
శారదాదేవి ([[డిసెంబరు 18]] , [[1853]] - [[జూలై 20]] , [[1920]]), జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవి ని శారదామాయి/శారదమాత/శ్రీ మా/హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించడంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు విస్తరించడంలో ముఖ్యపాత్ర పోషించారు.
 
శారదాదేవి జయరాంబాటిలో జన్మించారు. ఐదేళ్ళ బాల్యప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కాని కిశోరప్రాయం వరకూ రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతులిరువురూ జీవించినంతకాలం సన్యాసులవలే కఠోరబ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్ళు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉంటుండేవారు. రామకృష్ణులశిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకొన్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహనివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు.
 
 
== జననం, తల్లిదండ్రులు ==
 
 
శారదమణి దేవి, పశ్చిమబెంగాల్లో ఒక కుగ్రామమైన జయరాంబాటిలో ఒక పేదబ్రాహ్మణ ఇంట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు రామచంద్ర ముఖోపాధ్యాయ, శ్యామసుందరీదేవి ధార్మికులు. రామచంద్రకి జీవనాధారం పౌరోహిత్యం, వ్యవసాయం. శారదాదేవి జననం ముందు తల్లిదండ్రులిద్దరికీ మానవాతీత అనుభూతి కలిగిందని ప్రతీతి.
Line 16 ⟶ 13:
 
== వివాహం ==
 
 
1855లో శ్రీరామకృష్ణులు సర్వం త్యజించి దక్షిణేశ్వర్ దగ్గర కాళీమందిరంలో ఆధ్యాత్మికసాధనలు చేస్తుండేవారు. ఆయన అమ్మ, సోదరుడు పెళ్ళి చేస్తే ఆయన ధ్యాస కాస్త లౌకికవిషయాలవైపు మళ్ళించవచ్చని భావించి వధువుకోసం వెతుకుతుంటే శ్రీరామకృష్ణులే ఈ శారదామణి తనకు తగిన సంబంధమని సూచించారు. 1859 మేలో వారి వివాహమైంది. అప్పుడు శారద వయస్సు 5ఏళ్ళు, రామకృష్ణులవయస్సు 23ఏళ్ళు. అప్పటి భారతీయ సమాజంలో అది సర్వసాధారణమైన విషయం.
Line 49 ⟶ 45:
శారదాదేవి సాంప్రదాయిక పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు, పుస్తకాలూ ఏమీ రాయలేదు. ఆమెతో పెక్కుకాలం గడిపిన స్వామి నిఖిలానంద, స్వామి తపస్యానంద అనే శిష్యులిద్దరూ ఆమె జ్ఞాపకాలౌ, బోధనలౌ సూక్తులు "శ్రీశారదాదేవి చరితామృతం", "శ్రీశారదాదేవి వచనామృతం" అనే రెండు పుస్తకాల్లో గ్రంథస్థం చేశారు. ముఖతా ఆమెతో మాట్లాడిన గొప్పమేధావులు సైతం ఆమె ఆధ్యాత్మికజ్ఞానానికి అబ్బురపోయేవారు. ఆమె బోధనల సారాంశం.
 
-* క్రమం తప్పక ధ్యానం చేయండి. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలమై ఒక స్థాయికి చేరి, ఇక ధ్యానం చేయకుండ ఉండలేని స్థితికి వస్తారు.
-* ప్రచండ వాయువు మేఘాలను చిన్నభిన్నం చేసినట్టు పావన్ భవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది. జపం ఒక సాధన మనం ప్రయత్నించి అభ్యసంచాలి.
-* మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే
 
 
"https://te.wikipedia.org/wiki/శారదా_దేవి" నుండి వెలికితీశారు