గూటాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''గూటాల కృష్ణమూర్తి''' తెలుగు సాహితీకారుడు, రచయిత.
గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. [[రాచకొండ విశ్వనాథశాస్త్రి]] పట్ల అభిమానం. [[శ్రీశ్రీ]] మహా ప్రస్థానం కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహి త్యాభిమాని కృష్ణమూర్తి. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.▼
▲గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. రాచకొండ విశ్వనాథశాస్త్రి పట్ల అభిమానం. శ్రీశ్రీ మహా ప్రస్థానం కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహి త్యాభిమాని కృష్ణమూర్తి. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.
విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది. బాపు గారి మిత్రులైన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు వారి కొడుకు, కోడలు వారి పిల్లలను చూడడానకి లండన్ నుంచి ఇండియా వచ్చారు. ఆయన చాలా పెద్దవారు. 80 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టమే. పైగా వారు ఇండియా రావడం చాలా అరుదు. మార్చి ౩ (2009) న వారొచ్చినపుడు వారిని చాలామంది కలిసారు . ఆ సందర్భంగా వారు టంగుటూరి సూర్యకుమారితో వారికి వున్న పరిచయం గుర్తుచేసుకున్నారు (వీరే ఈ మధ్య 2008 లో సూర్యకుమారి గారిపై ఒక ఖరీదైన పుస్తకం ప్రచురించారు.). పైన వున్న బొమ్మను గూటాల గారు సూర్యకుమారిగారికి చూపించినపుడు, ఈ ట్రిక్కు ముందే తెలిస్తే బాగా చదువుకోవాలన్న కోరిక కొంతవరకైనా తీరేదని అన్నారంట. చదువుతున్నపుడు నిద్ర ఆపుకోలేక తల వాల్చడానికి ప్రయత్నిస్తే మేకుకు కట్టిన పిలక వల్ల అది సాధ్యపడదన్నమాట.
|