ఒంటె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
* వీటి పాదాల క్రింది భాగాలు పెద్దగా దిళ్ళవలె ఉండి [[ఇసుక]]లో పాదం దిగబడకుండా వేగంగా ప్రయాణించుటకు వీలవును.
* ఎడారులలో ఎక్కువ దూరము ప్రయాణించు ఈ జీవులు తమ కడుపులో ఎక్కువ నీటిని నిలువ చేసుకొని కొద్దిరోజుల వరకూ నీటిని తీసుకోకుండా జీవించగలవు.
*ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉండగలవు. అయితే నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు ఏడు లీటర్ల నీటిని తాగేస్తాయి!
*ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు.
*ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకుంటాయని, అందువల్లే కొన్నాళ్ల పాటు నీళ్లు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడిమినైనా తట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది!
*ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఎందుకంటే, ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. పైగా అది నాలుగు కాళ్లతోనూ తన్నగలదు!
*ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటి కనురెప్పలు రెండు పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది కాబట్టి వాటికి ఏ ఇబ్బందీ ఉండదు!
*శత్రువులు దాడి చేసినప్పుడు ఒంటెలు మొదట చేసే పని... ఉమ్మడం! ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయివి. ఆ జిగురును వదిలించుకోవడం, ఆ వాసనను భరించడం చాలా కష్టం!
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒంటె" నుండి వెలికితీశారు