లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
=== పర్యాటక రంగం ===
ఇక్కడి ప్రశాంత వాతావరణానికి శాస్త్రీయ పరిశోధనలకు అనువైన సముద్రతీలాల వలన లక్షద్వీఅపములు భారతీయులకు 1974 నుండి ప్రముఖ పర్యాటక ఆకర్షణ కలిగి ఉంది. పర్యాటకరంగం లక్షద్వీపాలకు గుర్తించతగినంత ఆదాయాన్ని ఇస్తుంది. పర్యాటకరంగం నుండి వచ్చే ఆదాయం క్రమంగా అభివృద్ధిచెందుతూ ఉంది. స్థలాభావంచేత ఈ ద్వీపాలలో ఫ్యాక్టరీలు నడపడానికి వీలు కాదు కనుక ప్రభుత్వంకూడా పర్యాటకరంగాన్ని ప్రోత్సహిస్తుంది. బంగరమ్ మరియు కడమట్ ద్వీపాలు పర్యాటకులను ఆకర్షించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా '''బంగరమ్''' ద్వీపం తీర్చిదిద్దబడుతుంది. సముద్రతీర వృక్షసంపద పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. నీటి క్రీడలు స్కూబాడైవింగ్, విండ్ సర్ఫింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్ మరియు ధైర్యసాహసాలతో కూడుకున్న సముద్రంలో నైట్ వాయేజ్ వంటి జలక్రీడలు పర్యాటక ఆకర్ష్ణలో ప్రబలమైనవి. సముద్రం పూర్తిగా ఉగ్రరూపం ధరించే నైరుతీ ఋతుపవన కాలంలో తప్ప సంవత్సరమంతా పర్యాటనకు అనుకూలమే.
 
ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్‌కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు.
 
=== జాలర్లు ===
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు