కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి విశ్వనాధ్.బి.కె. కల్లం అంజిరెడ్డి పేజీని కళ్ళం అంజిరెడ్డికి తరలించారు: ఇంటిపేరు మార్పుతో
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
* [[2005]] హాల్ పాహ్ ఫేం
* [[2011]] పద్మభూషన్
ఔషధ సంజీవి కన్నుమూత(శుక్రవారం_15-March-2013) అనారోగ్యంతో చికిత్స పొందుతూ-తుదిశ్వాస విడిచిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధినేత అంజిరెడ్డి. ఔషధ రంగంలో పేటెంట్ల రారాజు, తెలుగు రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి కంపెనీ సృష్టి , ప్రపంచ ఫార్మా పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం దక్కడంలో ప్రధాన పాత్ర ,నేడు(16-03-2013) హైదరాబాద్‌లో అంత్యక్రియలు
 
నిత్య రోగాలతో కృశించి పోతున్న వంద కోట్ల భారతావనికి 'సంజీవని'లా జనెరిక్‌ మందుల పరిశ్రమను అందించిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ అధినేత డాక్టర్‌ కళ్ళం 'అంజి'రెడ్డి ఇకలేరు. నిత్య పరిశోధకుడు, ప్రపంచ ఔషధ పరిశ్రమలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన తొలితరం పారిశ్రామికవేత్త, బహుళజాతి సంస్థలతో పోటీపడే విషయంలో దేశంలోని వందల మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి ప్రదాత అయిన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న 73 ఏళ్ల అంజిరెడ్డి రెండు వారాల క్రితమే చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిశారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తాడేపల్లి. ఆయనకు భార్య సామ్రాజ్యం, కుమార్తె అనురాధ, కుమారుడు సతీష్‌రెడ్డి ఉన్నారు. సతీష్‌రెడ్డి కంపెనీ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, అల్లుడు జి.వి.ప్రసాద్‌ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంజిరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు బంజారాహిల్స్‌లోని ఆయన నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం అంజిరెడ్డి అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి.
 
రైతు కుటుంబంలో పుట్టి, రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన అంజిరెడ్డి ఐడీపీఎల్‌ ఉద్యోగిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో 1984లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రూ.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే. అంజిరెడ్డి కొంతకాలంగా కంపెనీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా సేవారంగంలో తన కృషిని చివరి వరకు కొనసాగించారు. రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7 లోని నివాసం.
 
==రెడ్డేస్ లేబ్ మైలు రాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు