2009 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
==ప్రమాదం==
ఈ బెల్ 430 హెలికాప్టర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొంత సమయానికే అననుకూల వాతావరణానికి గురైంది. అధికారిక ప్రమాద నివేదిక ప్రకారం విమానం యొక్క వాతావరణ రాడార్ ఎరుపు రంగుని సూచించింది, దీని అర్థం వాతావరణం ప్రమాదభరితంగా ఉన్నదని. విమాన సిబ్బంది వారి అనుకున్న మార్గమునకు కొద్దిగా ఎడమ వైపున ప్రయాణించేందుకు నిర్ణయించుకున్నారు. పైలట్లు వాతావరణం మరీ అధ్వాన్నంగా మారడాన్ని గమనించి కృష్ణానది దాటిన తరువాత మలుపు తిరిగేందుకు నిశ్చయించుకున్నారు. ఉదయం 9:02 కి బేగంపేట మరియు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు తెగిపోయాయి, ఈ సమయానికి హెలికాప్టర్ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తున్నది. అయితే, కొంత సమయానికి 09:20 తరువాత ఫ్లైట్ సిబ్బంది ఆయిల్ ఒత్తిడి సరఫరా లో ఏర్పడిన సమస్యలను ఎదుర్కొవలసి వచ్చింది. పైలట్లు ఆయిల్ ఒత్తిడి సరఫరా లో ఏర్పడిన సమస్యలను నిలువరించేందుకు అత్యవసర తనిఖీ జాబితా విధానాలలోని ఆయిల్ ఒత్తిడి సరఫరా విభాగాన్ని కనుగొన్నారు, కానీ ఏర్పడిన సమస్యకు సరైన పరిష్కారమార్గం గుర్తించడం వారికి సాధ్యం కాలేదు. తరువాత వెంటనే సహ పైలట్ హెలికాప్టర్ ఏదో ప్రమాదానికి గురవబోతున్నదని భావించి ప్రమాద సూచికగా నిరంతరంగా గో ఆరౌండ్ అని అరిచాడు. ఆఖరి 14 సెకన్ల సమయంలో ఈ అరుపుల, కేకల పరంపరలు చాలా అధికంగా ఉన్నాయి. అ తరువాత హెలికాప్టర్ నియంత్రణ కోల్పోవడం వలన దాని ఫలితంగా అధిక వేగంగా తటాలున కిందికి దుమకడంతో క్రాష్ అయ్యింది.
 
==ఇవి కూడా చూడండి==