కళ్ళం అంజిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
==కంపెనీ స్థాపన==
పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో [[1984]]లో రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ను స్థాపించారు. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతుల ద్వారా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్న అత్యంత ఖరీదైన ప్రాణాధార ఔషధాలకు జనెరిక్‌ రూపాలను రూపొందించి, తృతీయ ప్రపంచ దేశాలకు ఆపద్బాంధవుడు అయ్యారు. బడా కంపెనీలతో పోటీపడి అనేక మందులకు పేటెంట్లు సాధించారు. రూ.25 లక్షల పెట్టుబడితో మొదలైన రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.వేల కోట్ల టర్నోవర్‌తో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజిలో నమోదైన తొలి ఆసియా ఫార్మా కంపెనీ ఇదే. అంజిరెడ్డి కొంతకాలంగా కంపెనీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా సేవారంగంలో తన కృషిని చివరి వరకు కొనసాగించారు. రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7 లోని నివాసం.
ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్‌కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం... అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు చేయటం భారతదేశం నుంచి ఏ పారిశ్రామికవేత్తకైనా సాధ్యపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం డాక్టర్‌ కల్లం అంజిరెడ్డి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు. ఒక మధ్యతరగతి పసుపు రైతు కుటుంబంలో జన్మించి, వీధి బళ్లో అక్షరాలు దిద్దిన ఆయన ఔషధ ప్రపంచాన్ని శాశించే స్థాయికి ఎదుగుతారని ఎవరూ వూహించి ఉండరు. పరిశోధననే ప్రాణపదంగా ఎంచుకొని అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ రూపంలో ఒక అరుదైన సంస్థను అందించిన డాక్టర్‌ అంజిరెడ్డి ఇక లేరంటే పరిశ్రమ వర్గాలు, ఆయన పట్టుదల- వ్యక్తిత్వం తెలిసిన వారు జీర్జించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా అంజిరెడ్డి స్థాపించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రస్తుతం దేశంలోని అగ్రగామి ఔషధ కంపెనీల్లో ఒకటి. రెండేళ్ల క్రితం అయితే ఒక దఫా ర్యాన్‌బ్యాక్సీని కూడా మించి దేశంలోని నంబర్‌-1 ఔషధ కంపెనీ స్థానాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ సొంతం చేసుకుంది. దేశం వెలుపల ఎంతో కట్టుదిట్టమైన నిబంధనలు అమల్లో ఉన్న అమెరికాలో, ఒకప్పటికి అగ్రరాజ్యం అయిన రష్యాలో అసాధారణమైన విజయాలు నమోదు చేసిన ఘనత ఆయన సొంతం. ఈ విజయ ప్రస్థానానికి పునాది ఆయన చదువుకునే రోజుల్లోనే పడింది.
పంక్తి 57:
* దేశంలో డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ చేపట్టిన తొలి కంపెనీ
* జపాన్ బయట నమోదైన తొలి ఆసియా కంపెనీ, [[2001]]లో న్యూయార్క్ స్టాక్ ఎక్షేంజ్ ప్రవేసించినది.
 
 
==2 అవార్డులు==
అంజిరెడ్డి కొంతకాలంగా కంపెనీ కార్యకలాపాలకు దూరంగా ఉంన్నా సేవారంగంలో తన కృషిని చివరి వరకు కొనసాగించారు. రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతికి ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.
 
* 1984, 1992 సర్, పి.సి. రాయ్ అవార్డు
* 998 ఫెడరల్ ఆఫ్ ఏషియన్ ఫార్మాసూటికల్ అసోషియేషన్ అవర్డు
* 2000 కెంటెక్ పౌండేషన్ అచీవర్ ఆఫ్ ద ఇయర్
* 2001 బిజినెస్ ఇండియా మ్యాగజైన్ నుండి బిజినెస్ మ్యాల్ ఆఫ్ ద ఇయర్
* 2011 పద్మశ్రీ
* 2005 హాల్ పాహ్ ఫేం
* 2011 పద్మభూషన్
 
==ఇతరాలు==
"https://te.wikipedia.org/wiki/కళ్ళం_అంజిరెడ్డి" నుండి వెలికితీశారు