మీనాక్షీ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith మినాక్షీ బెనర్జీ పేజీని మీనాక్షీ బెనర్జీకి దారిమార్పు లేకుండా తరలించారు
పంక్తి 30:
'''మినాక్షీ బెనర్జీ''' Ph.D. (1988, బనారస్), భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఆమె "అకాడామీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ" మరియు "ద నేషనల్ సైన్స్ అకాడమీ" లకు ఫెలోషిప్ పొందారు. ఆమె NASI కు జీవితకాల సభ్యులు. ఆమె ఆల్‌బెర్ట్ ష్వైట్జర్ అంతర్జాతీయ బంగారు పతకాన్ని సైన్స్ రంగంలో పొందడమే కాల అనేక అవార్డులు అందుకున్నారు. ఈమె యు.జి.సి అవార్డును కూడా పొందారు. ఆమె ప్రస్తుతం భోపాల్ లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం లో జీవశాస్త్రవిభాగానికి అధిపతిగా యున్నారు.
==జీవిత విశేషాలు==
ఆమె బాల్యంలో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం "అసాన్‌సోల్" లోని ఐరిష్ కాన్వెంట్,లొరెటో లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బాల్యంలో విద్యలో చురుకుగా ఉండుటచేత అందరిచేత ప్రశంసలు పొందారు. ఆమె బాల్యంలో తన యింటి పరిసరాలలో గల పెద్ద పూల తోటలో గడిపేటపుడు కొన్ని కీటకాలు పూల చుట్టూ తిరిగుటను నిశితంగా గమనించేవారు. ఈ పరిశీలన ఆమెను విజ్ఞాన రంగంపై తపన మరియు ఆశక్తిని రేకెత్తించింది. ఆ లేత ప్రాయంలోనే ఆమె లోతైన మనస్సులో శాస్త్రవేత్త లక్షణాలు ఆవిర్భవించాయి. ఆమె పాఠశాలలో చదువుకొనే కాలములో ఆమె చదువు, ఆటలు, సంగీతం, నాట్యము మరియు వక్తృత్వం పట్ల ఆశక్తి కనబరచేవారు. ఆ రంగాల పట్ల అనేక బహుమతులు గెలుచుకున్నారు.కానీ ప్రకృతి ని అధ్యయనం చేయాలనే ఉత్సుకత మిగిలిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో సైన్స్ విభాగంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని నిర్మల కాలేజీ లో చేరారు. ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బి.యస్సీ ని బోటనీ ప్రధానాంశంగా చేశారు.అదే విశ్వవిద్యాలయంలో C.A.S నుండి బోటనీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె సైనోబాక్టీరియా పై రాసిన ప్రత్యేక రచన ఆమెను సైనోబాక్టీరియాలజిస్టుగా చేసింది.
 
 
 
 
 
 
==మూలాలు==
* [http://www.ias.ac.in/womeninscience/LD_essays/42-44.pdf నా జీవితం లో పూర్తి విశ్వాసం]
* [http://www.bubhopal.nic.in/bioscience/biodata_meenakshi.pdf బయోడేటా]
"https://te.wikipedia.org/wiki/మీనాక్షీ_బెనర్జీ" నుండి వెలికితీశారు