మీనాక్షీ బెనర్జీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
ఆమె బాల్యంలో [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం "అసాన్‌సోల్" లోని ఐరిష్ కాన్వెంట్,లొరెటో లో విద్యాభ్యాసం ప్రారంభించారు. బాల్యంలో విద్యలో చురుకుగా ఉండుటచేత అందరిచేత ప్రశంసలు పొందారు. ఆమె బాల్యంలో తన యింటి పరిసరాలలో గల పెద్ద పూల తోటలో గడిపేటపుడు కొన్ని కీటకాలు పూల చుట్టూ తిరిగుటను నిశితంగా గమనించేవారు. ఈ పరిశీలన ఆమెను విజ్ఞాన రంగంపై తపన మరియు ఆశక్తిని రేకెత్తించింది. ఆ లేత ప్రాయంలోనే ఆమె లోతైన మనస్సులో శాస్త్రవేత్త లక్షణాలు ఆవిర్భవించాయి. ఆమె పాఠశాలలో చదువుకొనే కాలములో ఆమె చదువు, ఆటలు, సంగీతం, నాట్యము మరియు వక్తృత్వం పట్ల ఆశక్తి కనబరచేవారు. ఆ రంగాల పట్ల అనేక బహుమతులు గెలుచుకున్నారు.కానీ ప్రకృతి ని అధ్యయనం చేయాలనే ఉత్సుకత మిగిలిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులో సైన్స్ విభాగంలో రాంచీ విశ్వవిద్యాలయంలోని నిర్మల కాలేజీ లో చేరారు. ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బి.యస్సీ ని బోటనీ ప్రధానాంశంగా చేశారు.అచట బి.యస్సీ (ఆనర్స్) మొదటి శ్రేణిలో మొదటి స్థానాన్ని పొందారు. అదే విశ్వవిద్యాలయంలో C.A.S నుండి బోటనీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.మాస్టర్స్ డిగ్రీ లో కూడా మొదటి శ్రేణిలో మొదటి స్థానం సంపాదించి బంగారు పతకాన్ని పొందారు.పి.హెచ్.డి కొరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేరారు. ఆమె సైనోబాక్టీరియా పై రాసిన ప్రత్యేక రచన ఆమెను సైనోబాక్టీరియాలజిస్టుగా చేసింది. ఆమె ప్రకృతిలో సాధారణంగా గల 43 ఆకుపచ్చని అందమైన సూక్ష్మజీవులపై పరిశోధనను ప్రొఫెసర్ హె.డి.కుమార్ తో కలసి పనిచేసి పి.హెచ్.డి పూర్తిచేశారు. ఆ తర్వాత భోపాల్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం భర్కతుల్లా) లో లెక్చరర్ గా 1989 లో చేరారు.
==ఉద్యోగాలు.గౌరవాలు, అవార్డులు==
1989 లో భర్కతుల్లా విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా ఉద్యోగ బాధ్యతలు మొదలు పెట్టారు. ఆమె 1997 లో రీడర్ గానూ, మరియు 2005 లో ప్రొఫెసర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె జీవ శాస్త్ర విభాగంలో అధిపతిగా యున్నారు. ఆమె అనేక అవార్డులను స్వంతం చేసుకున్నారు. వాటిలో 1990 లో ఎం.పి. యంగ్ సైంటిస్ట్ అవార్డును, ఆ తర్వాత 1995 లో జర్మనీ లో గౌరవ డాడ్ ఫెలోషిప్ పొందారు. ఆమె 1995 లో శైవలం ఫిజియాలజీ, సైనోబాక్టీరియా యొక్క ఆవరణశాస్త్రం మరియు బయోకెమిస్ట్రీ లలో చేసిన పరిశోధనలకు గానూ జె.ఎ.బి.యంగ్ సైంటిస్ట్ అవార్డును స్వంతం చేసుకున్నారు. 1998 లో యు.కె లో గౌరవనీయమైన స్టాఫ్ అకాడమిక్ కామన్వెల్త్ ఫెలోషిప్ ను బయోటెక్నాలజీ లో పొంది, దుర్హాం విశ్వవిద్యాలయంలో గౌరవ విజిటింగ్ ఫెలోగా గౌరవం పొందారు. అచట ఆమె జీవ శాస్త్రంలో క్రొత్త శాఖ అయిన ఆస్ట్రోబయాలజీ (బాహ్య అంతరిక్షంలో గల జీవుల పై అధ్యయనం మరియు అంటార్కిటిక్ లొ సారూప్యత) పై అధ్యయనం కొనసాగించారు. 2002 లో ఆమె శాస్త్రవేత్తలకు ఇచ్చిన ప్రముఖ UGC కెరీర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును సంబంధిత రంగంలో గణనీయమైన చెప్పుకోదగిన కృషికి యిస్తారు. మార్చి 2003 లో డాక్టర్ బెనర్జీ నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ న్యూఢిల్లీ వారి యొక్క అంతర్జాతీయ బోర్డు ద్వారా సైనో బాక్టీరియాలజీ రంగంలో చేసిన అత్యున్నత కృషికి గానూ గౌరవనీయ సైంటిస్ట్ అవార్డ్ ను పొందింది. 2004 లో బెనర్జీ జె.కె.పౌండేషన్, భారతదేశం ద్వారా పర్యావరణ బయోటెక్నాలజీ ప్రతిభకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ నేషనల్ అవార్డు గుర్తింపును UNESCO ద్వారా సత్కరించబడ్డారు.దీని ఫలితంగా నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ లో ఫెలోషిప్ ను పొందారు. ఆ,ఎ 2005 లో పర్యావరణ బయాలజీ అకాడమీ ఆఫ్ ఫెల్లోషిప్ అవార్డు కూడా పొందారు మరియు అంతర్జాతీయ అవార్డుల బోర్డు NESA 2005 నుండి "సైంటిస్ట్ ఆఫ్ ద యియర్" అవార్డును స్వంతం చేసుకున్నారు. యిటీవల 2006 లో ఆమె యు.కె. లోని ఆల్బర్ట్ ష్వైట్జర్ ఇంటర్నేషనల్ పౌండేషన్ నుండి గౌరవ ఆల్బర్ట్ ష్వైట్జర్ సైన్స్ మెడల్ ను అందుకున్నారు. డాక్టర్ బెనర్జీ జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతిని అనేక శాస్త్రీయ బాడీస్ లో ఫెలో మరియు జీవిత సభ్యులుగా ఉన్నారు.
 
 
 
 
 
<!--
There she worked on the very new branch of biological science i.e. Astrobiology which deals with studies of organisms in outer space and its
analogous in the Antarctic. In 2002 Dr Banerjee received the reputed UGC Career Award given to scientists in
recognition of the significant noteworthy contributions in their respective field to specialization and academic
career.
In March 2003 Dr Banerjee received the coveted Scientist of the Year Award for her out standing
contributions in the field of Cyanobacterial Biotechnology by the International board of Awards of the National
Environmental Science Academy New Delhi. In 2004 Dr Banerjee was honored with the UNESCO recognized
Netaji Subhas Chandra Bose National Award for Excellence in Environmental Biotechnology by J.K.
Foundation, India followed by the Fellowship Award of the National Environmental Science Academy. She
has also been the recipient of the Fellowship Award of the Academy of Environmental Biology, 2005 and
Distinguished Scientist of the Year by International Board of Award NESA 2005. Recently she has
received the coveted Albert Schweitzer Science Medal from the Albert Schweitzer International
Foundation UK, 2006 and the DBT Overseas Associateship to USA from Department of Biotechnology,
Ministry of Science Technology, and Govt. of India. –2006-07.
Dr Banerjee is a Fellow and Life member of many Scientific Bodies of National and International repute.
Widely traveled, Dr Banerjee has visited many foreign countries to deliver talks and attend conferences. Dr
Banerjee has been actively engaged in the various aspects of Algal Biotechnology and Cyanobacterial
"https://te.wikipedia.org/wiki/మీనాక్షీ_బెనర్జీ" నుండి వెలికితీశారు